
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -608 లో.....సుమిత్ర నోట్లో నుండి బ్లడ్ పడడంతో దశరథ్ టెన్షన్ పడతాడు. దశరథ్, కార్తీక్, దీప పక్కకి వస్తారు. ఇప్పటికైనా అర్థం అయిందా పరిస్థితి ఎలా ఉందోనని కార్తీక్ అంటాడు. ఇప్పటికైనా ఒప్పుకోండి అని కార్తీక్ అంటాడు. ఎలా ఒప్పుకోనురా నా కూతురు నా చేతుల్లో పెరగలేదు. నా మనవరాలైనా నా చేత్తో పెంచాలని మురిసిపోయానని దశరథ్ ఎమోషనల్ అవుతాడు.
అత్తని కాపాడాలని కార్తీక్ అంటాడు. నాన్న అని పిలుపుకి దూరం అవుతున్నావ్.. అది నీకు అర్ధం కావడం లేదా అని దశరథ్ అంటాడు. అందుకు శౌర్య ఉందని కార్తీక్ బదులు చెప్తాడు. ప్లీజ్ నాన్న ఒప్పుకోండి అని దీప రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత డాక్టర్ చెప్పినట్లు దీప హాస్పిటల్ లో అడ్మిట్ కావాలని శివన్నారాయణని నెల రోజులు లీవ్ అడుగుతాడు. ఎందుకని జ్యోత్స్న అంటుంది. అగ్రిమెంట్ ప్రకారం నువ్వు నన్ను లీవ్ అడగాలని జ్యోత్స్న అంటుంది. నా భార్యకి బెడ్ రెస్ట్ అవసరం అన్నారు. తనకి సేవ చేసుకుంటా ఇంట్లోనే ఉంటానని కార్తీక్ అనగానే సరేనని శివన్నారాయణ ఒప్పుకుంటాడు. నేను ఒప్పుకొను అవసరం అయితే ఆ బెడ్ రెస్ట్ ఏదో ఇక్కడే తీసుకోమను ఏర్పాట్లు చేస్తానని జ్యోత్స్న అంటుంది. అవసరం లేదు మాకు ఒక ఇల్లు ఉందని కార్తీక్ అంటాడు.
నేను లీవ్ ఇవ్వనని జ్యోత్స్న చెప్పగానే ఇవ్వకపోవడానికి నువ్వు ఎవరు అవసరం అయితే అగ్రిమెంట్ ప్రకారం డబ్బు నేను కడతానని శివన్నరాయణ అంటాడు. జ్యోత్స్నకి దిమ్మ తిరుగుతుంది. దీప, కార్తీక్ బయటకు వస్తారు. వాళ్ళ వెనకాలే దశరథ్ వచ్చి ఎందుకు లీవ్ అడిగారని అడుగుతాడు. హాస్పిటల్ లో అడ్మిట్ కావడానికి అని కార్తీక్ చెప్తాడు. దీప కడుపు లో పెరుగుతున్న బిడ్డని చంపక తప్పదు మావయ్య అని కార్తీక్ అంటాడు. ఆ మాట పారిజాతం విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







