‘పాడుతా తీయగా’ విన్నర్ మాస్టర్ సార్థక్... డబుల్ ఫ్రైజ్ మనీ
on Dec 19, 2022
ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని ప్రోగ్రామ్స్ లోకి ఉత్తమమైన కార్యక్రమంగా "పాడుతా తీయగా" అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు సీజన్ 20 గ్రాండ్ ఫినాలే పూర్తయ్యింది. ప్రతీ వారం పోటాపోటీగా చిన్నారి కంటెస్టెంట్స్ పాడేవారు. ఇక ఈ సిరీస్ 20 టైటిల్ విన్నర్ గా సార్థక్, ఇక సెకండ్ ప్లేస్ విన్నర్ గా కీర్తన, ఇక థర్డ్ ప్లేస్ విన్నర్ ఆశ్రిత్ రాఘవ నిలిచారు. ఇక వీళ్లకు బహుమతులు అందించారు క్రేన్ వక్కపొడి-దుర్గ డెయిరీ సంస్థల అధినేత గ్రంధి కాంతారావు.
ఇక ఆల్రెడీ అనౌన్స్ చేసిన ప్రైజ్ అమౌంట్ ని డబుల్ చేస్తున్నట్టుగా ఆయన స్టేజి మీద ప్రకటించేసరికి ఆడియన్స్ ఈలలతో స్టేజి దద్దరిల్లిపోయింది. 1st ప్రైజ్ విన్నర్ కి 10 లక్షలు, 2nd ప్రైజ్ విన్నర్ కి 6 లక్షలు, 3rd ప్రైజ్ విన్నర్ కి 4 లక్షలు అనౌన్స్ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ " మీ నాన్నగారు బాలసుబ్రహ్మణ్యంగారు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రాన్ని నిర్వహించేవారు. తర్వాత మీరెలా చేస్తారో అని అందరూ అనుకున్నారు..కానీ మీరు కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు. వీళ్ళు పిల్లలు కాదు..ఎంతో అద్భుతంగా పాడారు. నెక్స్ట్ సీజన్ కి కూడా మేమే స్పాన్సర్ చేస్తున్నాం " అని చెప్పారు. ఇక ఫైనల్ గా విన్నర్స్ కి ట్రోఫీస్, సర్టిఫికెట్స్, చెక్స్ ఇచ్చి ఈ సీజన్ ని ఎండ్ చేశారు ఎస్పీ చరణ్.
Also Read