టికెట్ టు ఫినాలే లో నిఖిల్.. ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్!
on Nov 29, 2024
.webp)
బిగ్ బాస్ సీజన్-8 లో గత నాలుగు రోజుల నుండి టికెట్ టు ఫినాలే కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ఇక ఇందులో భాగంగా ఇప్పటికి రోహిణి, అవినాష్ కంటెండర్ షిప్ కి అర్హత సాధించిగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో నిఖిల్ కంటెండర్ అయ్యాడు.
రోహిణి, అవినాష్, టేస్టీ తేజాలు కామెడీతో పొట్ట చెక్కలు చేశారు. ప్రకాష్ అండ్ పరిమిళగా అవినాష్, రోహిణిలు అద్దరగొట్టేశారు. పంచ్‌లు అయితే మామూలుగా పేలలేదు. ఆ వయసులో ముసలోడు గట్టోడే.. నలుగురు పిల్లలూ అని గ్యాప్ ఇచ్చి.. దత్తత తీసుకొచ్చేడని రోహిణి సిగ్గుపడే సీన్ పొట్ట చెక్కలు చేసింది. వీళ్ల కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవల్ అనేట్టుగానే ఉంది. ఇక్కడి వరకూ అంతా కామెడీగానే సాగింది. ఇక టికెట్ టు ఫినాలే రేస్‌లో భాగంగా.. మూడో పోటీదారుడ్ని ఎంపిక చేయడానికి హౌస్‌లోకి పునర్నవి, వితికలు వచ్చారు. టాస్క్‌లో ప్రతిభ చూపని వాళ్లకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చే విషయంలో రచ్చ రేగింది. అందరూ ఈక్వల్‌గానే ఆడారు.. ఇది టఫ్ డెసీషన్ కాబట్టి తప్పడం లేదంటూ ప్రేరణని రేస్ నుంచి తప్పిస్తూ ఆమెకి బ్లాక్ బ్యాడ్ ఇచ్చారు వితిక, పునర్నవిలు. దాంతో హర్ట్ అయిపోయింది ప్రేరణ. ఇది గేమ్.. అక్కడ నేను బాగానే ఆడానని ప్రేరణ అనడంతో.. మాకూ తెలుసు ప్రేరణా ఇది గేమ్ అని.. నువ్వు గౌతమ్ ఆడిన ఆటలో.. గౌతమ్ ఫెయిర్‌గా ఆడాడని తెగేసి చెప్పింది వితిక. దీంతో ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక నిన్నటి టాస్క్ లో టేస్టీ తేజని మొదటనే తప్పించడంతో తను ఎమోషనల్ అయ్యాడు. ఇక టాస్క్ లో పృథ్వీకి ఎక్కువ పాయింట్లు వచ్చాయి. కానీ అతను ఫెయిర్ గా ఆడలేదంటూ నిఖిల్ ని విజేతగా ప్రకటించాడు బిగ్ బాస్. గౌతమ్, ప్రేరణ ఇద్దరిలో గౌతమ్ ఫెయిర్ గా ఆడినా మూడో స్థానంలో నిలిచాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



