Home

»

Tv News

యూనివర్స్ ఇచ్చే ఒక చిన్న ముద్దు లాంటిది వర్షం... ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్!

Mar 03, 2026

నిహారిక కొణిదెల మెగా ఫాదర్ కి కూతురిగా, మెగా ప్రొడ్యూసర్ గా, నటిగా ఎన్నో రోల్స్ పోషిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాంటి నిహారిక బుల్లితెర మీద ఆట డాన్స్ షోకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. ఇక సుధీర్, నిహారిక, రాధికా కలిసి ఈ డాన్స్ షోని నవ్వుల షోగా మార్చేశారు. ఈ వీక్ ఎపిసోడ్ ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. మధ్యలో సుధీర్ నాగబాబుతో ఉన్న అనుబంధం గురించి అడిగాడు. "మీ నాన్న గారితో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ చెప్పండి" అంటూ సుధీర్ నిహారికకు అడిగాడు. "నాకు వర్షం అంటే చాలా ఇష్టం.

చిన్నప్పుడు నాన్న చెప్పారు వర్షం ఎప్పుడంటే అప్పుడు రాదు. అడిగినప్పుడు రాదు. యూనివర్స్ ఇచ్చే ఒక చిన్న ముద్దు లాంటిది. వర్షం వచ్చినప్పుడే నువ్వు ఆనందించాలి, కౌగిలించుకోవాలి. ఆ మాట ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి వర్షం పడినప్పుడల్లా నేను బయటకెళ్ళి వర్షంలో తడుస్తాను పక్కన మా నాన్న ఉంటె ఆయన్ని కూడా వానలో తడిపేస్తాను. ఆ ఒక్క టైములో మా డాడీ నాతో కలిసి డాన్స్ చేసేది. వర్షం సినిమాలో త్రిష ఉంటది కదా అలా.

నేను స్కూల్ లో నేర్చుకోలేని చాలా విషయాలు మా నాన్న దగ్గర నేర్చుకుంటాను. అందుకే ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్ ఆయనే నాకు అన్ని. నేను ఒక రోజు మా అన్నను కొడితే ముక్కులోంచి రక్తం కూడా వచ్చింది. నా ప్రాబ్లమ్ ఏంటో తెలుసా చిన్నప్పుడు మా అన్నను కొట్టి నేనే ఏడ్చేదాన్ని. అందుకే మొన్న ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాడు. " అంటూ వాళ్ళ నాన్న అన్న గురించి చెప్పింది నిహారిక.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com