కన్నడ వాళ్ళను ఇక షోస్ కి పిలవకండి...ఇలా అవమానించకండి..
on Jan 1, 2025
2024 వెళ్తూ వెళ్తూ ఆర్టిస్టుల మధ్యలో గొడవలు పెట్టి మరీ వెళ్ళింది. ఈటీవీలో రీసెంట్ గా ప్రసారమైన దావత్ షోలో కొంతమంది బుల్లితెర నటుల మధ్య గొడవలు జరిగాయి. అందులో హైలైట్ ఐన సబ్జెక్టు నూకరాజు - యాంకర్ సౌమ్యరావు. నూకరాజు సౌమ్య ఫోటో తీసి నిప్పుల్లో వేసి బూడిద చేసాడు. దాంతో సౌమ్య ఫుల్ ఫైర్ అయ్యింది. ఇద్దరి మధ్య స్టేజి మీద ఘాటుగానే గొడవ జరిగింది. "కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి యాంకరింగ్ చేసింది సౌమ్య. ఆమె మాట్లాడే పది మాటల్లో 8 బూతులు ఉంటాయి. ఏదైనా పని నేర్చుకునేటప్పుడు దాన్ని నేర్చుకుని వెళ్తే ఒక అర్ధం ఉంటుంది. తెలుగు నేర్చుకుంటే ఆమెకు తెలుగు షోస్ లో ప్లస్ అవుతుంది అనేది నా నమ్మకం అందుకే మేడం 2025 లో తెలుగు నేర్చుకుని మంచి మంచి షోస్ చేయాలని కోరుకుంటున్న" అన్నాడు నూకరాజు. దానికి సౌమ్య "ఎందుకండీ ఎప్పుడూ కన్నడ వాళ్ళను తక్కువగా చూస్తారు. నా మాతృబాష కన్నడ..అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడి షో చేయడం అంటే అది గొప్ప విషయం. మీరు కూడా కన్నడ ఇండస్ట్రీకి వచ్చి కన్నడ నేర్చుకుని షోస్ చేయాల్సింది అప్పుడు తెలిసేది" అన్నది సౌమ్య. "నాకు రానప్పుడు నేను కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళను" అన్నాడు నూకరాజు. "ఇలా జరుగుతుంది అనేటప్పుడు నన్ను షోకి పిలవకండి..నిజంగానే పిలవకండి.. మీ తెలుగు వాళ్లనే పిలుచుకోండి. నాకు వచ్చినంత తెలుగులో ఆడియన్స్ ని ఎంతగా ఎంటర్టైన్ చేయాలో అంత ఎంటర్టైన్ చేస్తున్నాను." అంటూ ఫైర్ ఐపోయింది సౌమ్య. దాంతో సుమ ఎంట్రీ ఇచ్చింది. ఈ టాపిక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లోకి వెళ్తోంది అంటూ సౌమ్యకు కొన్ని టిప్స్ చెప్పింది. "నేను మలయాళీ కానీ తెలుగు నేర్చుకుని యాంకరింగ్ చేస్తున్నా. కళాకారులను ఎవరినైనా ఆడియన్స్ ఆదరిస్తారు. ఎవరో ఏదో అన్నారని కాకుండా నువ్వు ఎం చేయాలి అనుకున్నావో అది చెయ్యి.." అంటూ సపోర్ట్ చేసింది.
Also Read