పాఠాలు చెప్తూనే పోవాలి అన్నారు దేవదాస్ కనకాల మాస్టారు : గుర్తు చేసుకున్న స్టూడెంట్స్
on Jan 1, 2025
న్యూ ఇయర్ స్పెషల్ గా దావత్ షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో రాజీవ్ కనకాలకు వాళ్ళ అమ్మ నాన్న విగ్రహాలను గిఫ్ట్ గా ఇచ్చారు నటుడు బ్రహ్మాజీ. ఆ గిఫ్ట్ ప్యాక్ ని ఓపెన్ చేసాక విపరీతంగా ఏడ్చేశారు రాజీవ్, బ్రహ్మాజీ, సమీర్. "మా మాస్టారు, లక్ష్మి మేడం ..ఈరోజు మేము నాలుగు ముద్దలు తింటున్నాం అంటే దానికి కారణం వాళ్లే..చాలా మందికి తెలుసు మా మాస్టారు, మేడం గురించి. టాప్ యాక్టర్స్ ఎంతో మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నవాళ్ళే.. యాక్టర్స్, డైరెక్టర్స్ అంతా కూడా వీళ్ళ ఫిలిం ఇన్సిట్యూట్ లోనే ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా వీళ్లంతా కలిసినప్పుడు వాళ్ళ గురించే తలచుకుంటూ ఉంటారు. అప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు కూడా అక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు. నేను వీళ్ళ కడుపున పుట్టడం నిజంగా నా అదృష్టం. నేను మొదట్లో మా పేరెంట్స్ ని బాగా ఇబ్బంది పెట్టాను. ఆ విషయం బ్రహ్మాజీ గారికి బాగా తెలుసు. నన్ను చిన్నప్పుడు చూసినవాళ్లకే తెలుసు నేను ఎంత అల్లరోడినో..గొప్ప గొప్ప నటులతో క్లాసెస్ ని షేర్ చేసుకోవడం నిజంగా ఎంతో అదృష్టం. నా తోడబుట్టినది, నా కన్నవాళ్ళు కూడా లేరు. " అని చెప్పారు రాజీవ్ కనకాల ఏడుస్తూ. ఇక సమీర్ మాట్లాడుతూ "నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఫీజ్ తీసుకోకుండా పాఠాలు చెప్పారు. ఉదయం లేస్తే చాలు ఇక్కడి ఇన్స్టిట్యూట్ లోనే ఉండేవాళ్ళం. లక్ష్మి మేడం మాకు భోజనం పెట్టేవాళ్ళు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న ఎంతో మంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు. మా మాస్టారు దేవదాస్ కనకాల గారు మాకు పాఠాలు చెప్తూనే అలా కుర్చీలోనే జీవితం వెళ్ళిపోవాలి అనేవారు" అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
Also Read