కొత్త MD గా బాధ్యతలు స్వీకరించిన జగతి మేడం!
on Jan 18, 2023
'గుప్పెడంత మనసు' ఇప్పుడు స్టార్ మా టీవి ప్రేక్షకులను ఆకర్షిస్తోన్న సీరియల్. మంగళవారం నాటి ఎపిసోడ్-662లో.. వసుధారని తల్చుకుంటూ ఇంట్లో ఉండలేక బయటకు వెళ్ళిపోతున్న రిషీని ఆపిన జగతి, మహేంద్ర ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా వినకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పేస్తాడు. అప్పుడు జగతి మేడం మాట్లాడుతూ "రిషి.. నువ్వు వెళ్ళు. ఆపే అధికారం నాకు లేదు. కానీ కాలేజీ కి వెళ్లి ఇక్కడ ఏం చెప్పావో అదే చెప్పు. లేదంటే కాలేజ్ లో వాళ్ళు ఎవరికి తోచింది వారు అనుకుంటారు" అని చెప్తుంది. అక్కడే ఉన్న రిషి పెద్దనాన్న కూడా జగతి చెప్పింది కరెక్ట్ అని అంటాడు. "కాలేజీలో మీటింగ్ పెట్టి నువ్వు చెప్పి వెళ్ళు" అని రిషి పెద్దనాన్న అనడంతో "సరే" అని చెప్పి కాలేజీకి వెళ్తాడు.
రిషి కాలేజీకి వెళ్లడంతోనే వసుధార జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. వసుధారతో కలిసి ఉన్న ప్లేస్ దగ్గరకి వెళ్లి తనని గుర్తు చేసుకుంటాడు. "ఇన్ని జ్ఞాపకాలు నాకు అందించి నాకు దూరం అయ్యావా వసుధార. నా నుండి వెళ్ళిపోయి నాకు పెద్ద శిక్ష వేశావ్" అని తనలో తాను మాట్లాడుకుంటాడు.
ఆ తర్వాత బోర్డ్ మీటింగ్ ఉంటుంది. అందులో రిషి ఫాకల్టీతో మాట్లాడుతూ ఉంటాడు. "నాకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు థాంక్స్. అలాగే కొత్త MD కి కూడా సపోర్ట్ చెయ్యండి" అని చెప్తాడు. "మరి మీరు సర్?" అని ఒక ఫ్యాకల్టీ సర్ అడుగుతాడు.
"నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు విశ్రాంతి కావాలి. కొత్త MD గా జగతి మేడం గారు బాధ్యతలు తీసుకుంటారు" అని రిషి చెప్తాడు. మీటింగ్ ముగిసాక ఫ్యాకల్టీ అంతా వెళ్ళిపోయి మహేంద్ర, జగతి, రిషి పెద్దనాన్న, రిషి ఉంటారు. "వెళ్ళక తప్పదా?" అని రిషి పెద్దనాన్న అడుగుతాడు. "గాయం మానాలంటే వెళ్ళక తప్పదు" అని రిషి బదులిస్తాడు.
కార్ లో కాలేజ్ నుండి వెళ్లిపోతూ ఉంటే వసుధార ఎదురు పడుతుంది. "రిషి సర్" అని పిలవగానే కార్ ఆపుతాడు. మళ్ళీ వసుధార అన్న మాటలను గుర్తు చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జగతి, మహేంద్రల దగ్గరికి వస్తుంది వసుధార.
జగతి కోపంగా "నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావ్" అని అడుగుతుంది. "ఏంటీ మేడం అలా అంటారు. నన్ను మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా ఎన్నుకున్నారు కదా? ఆ వర్క్స్ స్టార్ట్ చెయ్యమని మినిస్టర్ గారి నుండి మెయిల్ వచ్చింది. అందుకే వచ్చాను. MD సర్ బయటకెళ్ళినట్టున్నారు" అని వసుధార అంటుంది. అలా అనగానే మహేంద్ర "ఇప్పుడు ఈ కాలేజీకి MD జగతి మేడం" అని చెప్పగానే వసుధార షాక్ అవుతుంది. "రిషి సర్ ఎక్కడికెళ్ళాడో తెలుసుకోవచ్చా మేడం?" అని వసుధార అడుగుతుంది. "కనపడని గమ్యాన్ని వెతుక్కుంటూ, చూడని దారుల్లో వెళుతున్నాడు" అని జగతి మేడం చెప్తుంది. ఇది విని వసుధార ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
