ఆదికి వార్నింగ్ ఇచ్చిన నెటిజన్స్
on Dec 2, 2023
ఢీ ప్రీమియర్ లీగ్ ప్రీ- ఫైనల్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ కి మిష్టర్ బ్యూటిఫుల్ మేల్ యాంకర్ సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. తనదైన మార్క్ స్టైల్ కళ్ళజోడు సెటప్ తో ఫిమేల్ ఫాన్స్ దిల్ కుష్ చేసాడు. ఇక సుడిగాలి సుధీర్ ఉంటె హైపర్ ఆదికి ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు కూడా సుధీర్ మీద జోక్స్ వేసి ఎంటర్టైన్ చేసాడు. "ఏంటన్న కొత్తగా మూవీస్ ఎం చేస్తున్నావ్" అని ఆది అడిగేసరికి "బాలీవుడ్ నుంచి రెండు స్టోరీస్ వచ్చాయి వింటున్న" అని సుధీర్ చెప్పేసరికి "నేను వింటున్నా నువ్వు చెప్పే సొల్లు కబుర్లు" అంటూ సుధీర్ డైలాగ్ కి ఆది పంచ్ డైలాగ్ వేసాడు.
"అవును నీదగ్గర చిలక ఉందట కదా ఎక్కడ ఉంది" అని సుధీర్ అడిగేసరికి 'ఒరేయ్ వద్దులే పోరారేయ్" అని ఆది కౌంటర్ వేసేసరికి సుధీర్ క్యూట్ గా స్మైల్ ఇచ్చాడు. "10 .30 వరకే కాలింగ్ సహస్ర. అదే ఆ టైం దాటిందంటే కాలింగ్ గీత, కాలింగ్ సరళ, ఆ తర్వాత కూలింగ్ ఆ తర్వాత లింగిడి లింగిడి" అంటూ సుధీర్ నటించిన "కాలింగ్ సహస్ర" మూవీకి ప్రమోషన్ చేసాడు ఆది. "సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన చాలా రోజుల తర్వాత ఢీ స్టేజి మీద సుడిగాలి సుదీర్ ని చూడడం బాగుంది బాస్ గుడ్..సుధీర్ ది కింగ్ ఆఫ్ బుల్లితెర...బుల్లి తెర దేవుడొచ్చాడు..ఇక ఈ ఎపిసోడ్ కేక" అంటూ సుధీర్ ని నెటిజన్స్, ఫాన్స్ పొగిడితే ఆదిని మాత్రం తిట్టడం స్టార్ట్ చేశారు. "ఆదిగా చాలా ఎక్కువ చేస్తున్నావ్ సుదీర్ అన్న నిజంగా హీరో... కొంచెం నోరు అదుపులో పెట్టుకో" అంటూ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. ఇక సుధీర్ ఈ మధ్య మూవీస్ మీద ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టాడు. ఇక డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా సుధీర్ కి క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తూ మంచి మూవీస్ తీస్తూ అతని ఫేమ్ ని ఇంకా పెంచుతున్నారు.
Also Read