Home

»

Tv News

Illu illalu pillalu: కలిసిపోయిన వేదవతి, నర్మద.. శ్రీవల్లికి టెన్షన్!

Mar 10, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu Pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-414లో.. వేదవతితో నర్మద మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ వేదవతి కోపంగా ఉంటుంది. ఇక అక్కడే ఉన్న శ్రీవల్లిని పిలుస్తుంది. వెళ్ళి కొబ్బరి నూనె తీసుకురావే అని శ్రీవల్లిని వేదవతి అంటుంది. దాంతో తను తీసుకొస్తుంది. ఇక శ్రీవల్లిని కూర్చోమని తన తలకి కొబ్బరి నూనె పెడుతుంటుంది వేదవతి. మరోవైపు నర్మద ఫీల్ అవుతుంది. ‌ఇక అక్కడే ప్రేమ, ధీరజ్ ఉంటారు. ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. అది ప్రేమ అమలుచేస్తుంది. అక్క నేను అత్తయ్య అనుకొని నువ్వు ఏం మాట్లాడాలని అనుకుంటున్నావో నాతో చెప్పమని నర్మదతో ప్రేమ అంటుంది.

అత్తయ్య నాకు తెలియకుండా సాగర్ డబ్బు తీసుకొని జాబ్ కొన్నాడు. ముందురోజే చెప్పాడు. చనిపోతాడని అన్నాడు. అందుకే నా నగలు తాకట్టు పెట్టి ఆ వనజకి డబ్బు కట్టాం.. మీకు చెప్దామంటే తర్వాత రోజే మా నాన్న పార్టీ అని చెప్పాడు. అంతే తప్ప తల్లి లాంటి మిమ్మల్ని మోసం చేయాలని కాదని సారీ అత్తయ్య.. ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రేమతో నర్మద అంటుంది. అదంతా విన్న వేదవతి ఆలోచనలో పడుతుంది‌. ఇక తన మనసు మారుతుందేమోనని శ్రీవల్లి రెచ్చగొడుతుంది. తన మాటలు నమ్మి కోపంగా వేదవతి వెళ్తుంటే తన వెనకాలే నర్మద వెళ్తుంటుంది. అప్పుడే ప్రేమ తన కాలుని నర్మదకి అడ్డుగా పెట్టడంతో తను పడిపోతుంది. వెంటనే వేదవతి ఆగిపోతుంది. ఇక ప్రేమ యాక్టింగ్ చేస్తుంది. అయ్యో అయ్యో అత్తయ్య కోపంలో అక్కని పడేసింది.. తనకి ప్రేమ, దయా ఏమీ లేవా అంటు ప్రేమ యాక్టింగ్ చేస్తుంది. దాంతో వేదవతి కరిగిపోతుంది. నిజంగా తాకిందా అంటూ నర్మద దగ్గరికి వస్తుంది. ఇక మీకు చెప్పకుండా ఏదీ చేయనని నర్మద సారీ చెప్తుంది. దాంతో వేదవతి ఒకే అంటుంది. ఇద్దరు కలిసిపోతారు. అది చూసి శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. మరోవైపు సాగర్ కు జాబ్ ఇప్పించిన బ్రోకర్ నడుచుకుంటూ వస్తుంటే అప్పుడే ఆనందరావు వస్తుంటాడు. అతడిని చూసి ఆనందరావు దగ్గరికి వస్తాడు బ్రోకర్. ఏం అయింది జాబ్ అన్నారని అడుగగా నేను కాదని ఆనందరావు తప్పించుకొని ఇంటికి పారిపోతాడు. దాంతో ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు బ్రోకర్. ఇక భాగ్యం లోపలి నుండి బయటకి వస్తుంది. బ్రోకర్ తనని చూసి షాక్ అవుతాడు. మలయాళం బ్యూటీ మీరేనా అని షాక్ అవుతాడు. నేను భాగ్యం అంటూ చెప్తుంది. సరే అమ్మకుట్టిని పిలిపించండి అని బ్రోకర్ అనగానే రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది భాగ్యం. తన చేయి పట్టుకున్నాడంటు చుట్టుప్రక్కల వాళ్ళని భాగ్యం పిలవగానే బ్రోకర్ అక్కడి నుండి పారిపోతాడు.

ఇక ఆనందరావుని భాగ్యం కొడుతుంటే అప్పుడే శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. నర్మద, వేదవతి ఇద్దరు కలిసిపోయారని శ్రీవల్లి చెప్పగానే కంగారుపడకు కాలం ఒకసారి వాళ్ళకి కలిసివస్తుంది. ఒకసారి మనకి కలిసి వస్తుందని భాగ్యం చెప్తుంది. సాగర్ గురించి రామరాజుకి తెలిసేలా చేసింది మనమే అని నర్మదకి తెలియకుండా జాగ్రత్తగా ఉండాలని శ్రీవల్లితో భాగ్యం చెప్తుంది. మరోవైపు ధీరజ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఈరోజు స్పెషల్ డే.. లైఫ్ లాంగ్ మెమోరియల్ గా ఉండాలని చెప్తాడు. అప్పుడే ప్రేమ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావ్ రా అని అడుగుతుంది. అమ్మాయితో అనగానే ప్రేమ కుళ్ళుకొని ధీరజ్ ఫోన్ లాక్కుంటుంది. అందులో కిరణ్ అని ఉండటంతో.. నాకే అమ్మాయి అని అబద్ధం చెప్తావారా అంటూ ధీరజ్ ని ప్రేమ కొడుతుంది. ‌అలా ఇద్దరు దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com