Bigg Boss 8 : సోనియాని నోరు అదుపులో పెట్టుకోమన్న నాగార్జున!
on Sep 15, 2024
బిగ్ బాస్ సీజన్ 8 తాజా ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకాడు హోస్ట్ నాగార్జున. హౌస్ లో వారం మొత్తం కంటెస్టెంట్స్ యెుక్క బిహేవియర్ ని చూసి వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. (Bigg Boss 8 Telugu)
మొదట చీఫ్ ల బాధ్యతలు గుర్తుచేసి వారు సరిగ్గా చేయలేదని చెప్పి యష్మీ, నైనికలని చీఫ్ బాధ్యతల నుండి తొలగించిన నాగార్జున.. హౌస్ లో సోనియాది వరెస్ట్ బిహేవియర్ అంటు వార్నింగ్ ఇచ్చేశాడు. అసలు సోనియా చేసిన తప్పేంటి? నాగార్జున ఏం అన్నాడో ఓసారి చూసేద్దాం...90 మార్క్స్ వస్తాయన్న స్టూడెంట్‌కి 40 మార్క్స్ వస్తే నిరుత్సాహం ఉంటుంది కదా అని నాగార్జున అన్నాడు. నాకు స్కోప్ కనిపించడం లేదు సర్ అని సోనియా అనగానే.. స్కోప్ ఉండదు.. నువ్వు తీసుకోవాలని చెప్పాడు. గత వారం విష్ణు ప్రియ క్యారెక్టర్ గురించి చాలా నీచంగా మాట్లాడిన ఇష్యూని లేవనెత్తుతూ వీడియో ప్లే చేశాడు. నిన్ను పట్టించుకోవడానికి ఎవరూ లేరేమో విష్ణుప్రియా.. నాకు ఫ్యామిలీ ఉంది.. పట్టించుకునే వాళ్లు ఉన్నారంటూ సోనియా నోటికొచ్చినట్టు మాట్లాడిన వీడియోని హౌస్ మేట్స్ అందరికి వేసి చూపించాడు.
ఇక అదంతా చూసాక కూడా సోనియా ఎక్కడా తగ్గడం లేదు. నేను గొడవని పెంచాలని అనుకోలేదు సర్ అని సోనియా అనగానే.. నోరు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరమని అన్నాడు. నువ్వు ఇలా ఉంటే కుదరదు. ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు.. నువ్వు ఇలాగే ఉంటే వాళ్ళు నిన్ను ఎక్కడ ఉంచుతారో తెలుసు కదా అని నాగార్జున అనగానే.. సోనియా కాస్త భయపడ్డట్టు అనిపించింది. మరి హౌస్ లో ఇక నుండి అయినా తన బిహేవియర్ మార్చుకుంటుందో లేదో చూడాలి మరి.
Also Read