మా నాన్న ఎవరినీ మర్డర్ చేయలేదు!
on Apr 30, 2021
'కార్తీకదీపం' సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బుల్లితెరపై ఈ సీరియల్ కి అంత క్రేజ్ ఉంది. టీఆర్పీ విషయంలో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. రీసెంట్ గా వెయ్యి ఎపిసోడ్ లను పూర్తి చేసుకొని మరింత పాపులర్ అయింది ఈ సీరియల్. ఈ సీరియల్ లో డాక్టర్ బాబుగా పరిటాల నిరుపమ్.. వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ నటిస్తున్నారు. వారి పిల్లలు హిమ పాత్రలో సహృద, శౌర్య పాత్రలో కృతిక నటిస్తున్నారు. ఈ పిల్లలు ఇద్దరికీ కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
తరచూ డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ తమ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. అయితే శౌర్యగా కనిపించే కృతికకు సోషల్ మీడియాలో క్రేజ్ ఏర్పడడానికి కారణం.. ఇతరులకు సహాయం చేయాలనే ఆమె ఆలోచన. విరాళాలు, వృద్దాశ్రమాలు అంటూ చిన్నతనం నుండే ఎన్నో మంచిపనులు చేస్తోంది. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు చాట్ చేస్తూ టచ్ లో ఉంటోంది. తన మీద వచ్చే మీమ్స్, జోక్స్ ను కృతిక బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా అలాంటి ఓ మీమ్ పై కృతిక రియాక్ట్ అయింది.
'ఉప్పెన' సినిమాలో ఓ ఫేమస్ డైలాగ్ ని కృతికకు లింక్ చేస్తూ మీమ్ వేశారు. 'అబద్దాలు ఆడితే అమ్మాయిలు పుడతారంటారు.. ఇంత అందంగా పుట్టిందంటే వాళ్ల నాన్న మినిమమ్ మర్డర్ అయినా చేసుంటాడు' అని వైష్ణవ్ తేజ్ చెప్పే డైలాగ్ ను కృతిక కోసం వాడేశారు. ఇలా తన గురించి క్రియేట్ చేసిన మీమ్ ను చూసిన కృతిక.. ''మా నాన్న ఎవరినీ మర్డర్ చేయలేదు'' అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చింది. ఆమె రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
