నేను ప్రొడక్షన్ బాయ్ ని అనుకున్నావా..కామెడీ ప్రొఫెషనల్ ని
on Dec 3, 2022
ఈటీవీలో ప్రసారమైన " పటాస్" అనే కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కమెడియన్ యాదమ్మ రాజు. తర్వాత జీ తెలుగు నిర్వహించిన "అదిరింది" అనే కామెడీ షోలో చేసాడు.
ఇక ఇప్పుడు కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలోకి ఎంట్రీ ఇచ్చాడు..స్టేజి మీదకు వచ్చిన యాదమ్మ రాజుని చూసి "అవినాష్ రెండు ఛాయ్ తే" అనేసరికి "రాజు ఎవరు అనుకుంటున్నావు స్టాక్" అన్నాడు సుధీర్. "చెప్పాలి కదా ముందే నేను ప్రొడక్షన్ అనుకున్నా" అని కవర్ చేసుకున్నాడు అవినాష్. "హలో ఇక్కడ ప్రొఫెషనల్..నాట్ ప్రొడక్షన్" అని యాదమ్మ రాజు అనేసరికి "ప్రొఫెషనల్" ఐతే స్పెల్లింగ్ చెప్పు ఆ పదానికి అని అన్నాడు. దాంతో యాదమ్మ రాజు సైలెంట్ ఐపోయాడు. నీ స్టాక్ చార్ట్ ఎలా ఉందో చూద్దాం అని సుధీర్ అనేసరికి " ఇఫ్ యూ సీ మై స్టాక్.. యువర్ మైండ్ విల్ బ్లాక్" అని డైలాగ్ వేసాడు రాజు.
ఇక చార్ట్ లో 60 పర్శంట్ అదృష్టవంతుడు అని వచ్చేసరికి కమెడియన్ అనుకున్నాం అందరం అన్నారు సుధీర్, దీపికా..ఇక యాదమ్మ రాజు వెళ్లి చైర్మన్ అనిల్ రావిపూడి చేతి మీద ముద్దు పెట్టి అతని బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
