ఏం చేస్తున్నావ్ అన్నవాళ్లకు...నెక్స్ట్ ఏమిటి అని అడిగిన వాళ్లకు...
on Jan 8, 2024
మెహబూబ్ దిల్ సే బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ లోకి రాకముందు.. టిక్ టాక్ వీడియోస్ , యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియో సాంగ్స్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక మెహబూబ్ క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. ఈ క్రేజ్ ద్వారానే బుల్లితెరపై పలు షోల్లో మెరుస్తున్నాడు.
అలాంటి మెహబూబ్ కొన్ని నెలల నుంచి స్టేజి మీద పెద్దగా కనిపించడం లేదు. "నటుడిగా మారి సినిమా కోసం పనిచేయాలనేది నా కల...కానీ ఎక్కడ నుండి ఎప్పుడు, ఎలా ప్రారంభించాలో నాకు అర్ధం తెలీదు. నా చిన్నతనంలో యాక్టింగ్ కోర్స్ నేర్చుకునే అవకాశం నాకు రాలేదు. కానీ నా కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలన్నంత ఆశ, తపన ఉండేవి. నిజం చెప్పాలంటే 2023 నాకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ గా సాగింది. అసలు నేనేం చేస్తున్నానో అంటూ అని నా కుటుంబం, నా స్నేహితులు , నా ఫాన్స్ అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు. నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అబ్బాయిలు, ఈ సంవత్సరం నేను భిక్షుస్ హౌస్ ఆఫ్ ఆర్ట్స్ లో నేను యాక్టింగ్ కోర్స్ చేసనము, ఆ వర్క్ షాప్స్ కి వెళ్లాను...థియేటర్ ఆర్ట్స్ కూడా ఇక్కడి నుంచే చేసాను. మహతి భిక్షు, అరుణ భిక్షు మేడం అలాగే ఎన్జె. భిక్షు సర్ నుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. భిక్షు సార్..ఈ నటనా కళ ఇంత అందంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఆ అనుభవాలను నేను మాటల్లో చెప్పలేను . నేను నా కలల వైపు ఇప్పుడిప్పుడే చిన్నపిల్లాడిలా అడుగులు వేయడం స్టార్ట్ చేసాను. నాకు మీ అందరి సపోర్ట్ అలాగే విషెస్ కూడా కావాలి. నాకు అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చినందు బిక్షూ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. దేనికైనా ఒక టైం రావాలి. మీరంతా నన్ను చూసి ప్రౌడ్ గా ఫీలవుతారు. లాస్ట్ ఇయర్ అనుకున్న ఇప్పుడు నా డ్రీమ్స్ ని ఫుల్ ఫిల్ చేసుకున్నా. మీ కలను ఆపేదెవరు. ఇది ఒక జీవితం. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయండి" అంటూ మెహబూబ్ దిల్ సే ఒక లాంగ్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్, బుల్లితెర సెలబ్రిటీస్ అంతా కూడా "మీరు నటన వైపు అడుగులు వేస్తున్నారు. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
