Home

»

Tv News

Podharillu:హారిక చెప్పినట్టుగా చక్రికి మహా విడాకులు ఇస్తుందా!

Mar 14, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -70 లో.... తప్పు కంప్లైంట్ ఇచ్చి మాధవ కుటుంబాన్ని  అరెస్ట్ చెయ్యమన్నారని పురుషోత్తంపై కోప్పడతాడు ఎస్ఐ. ఇంకొకసారి ఆ కుటుంబం జోలికి పోతే మర్యాదగా ఉండదని ఎస్ఐ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత పురుషోత్తం ఇంటికి వెళ్లి అందరి ముందు పరువుతీసావని గాయత్రిపై పురుషోత్తం కోప్పడ్డతాడు‌. నీ కోసం దుబాయ్ లో కష్టపడి పైసా పైసా కూడబెడితే నువ్వు వాడి చుట్టూ తిరుగుతావ్ ఏంటని గాయత్రిపై తాయారు కోప్పడుతుంది.

అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లి చూపులకి వస్తున్నామని చెప్తారు. మరొకవైపు మాధవ వాళ్ళు స్టేషన్ నుండి ఇంటికి వస్తారు. మాధవని మహా బయటే ఉండమని చెప్పి దిష్టి తీసుకొని వస్తుంది. దాంతో మాధవ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది.. ఇక ఆ విషయం గురించి వదిలెయ్యండి.. వాళ్ళ ఇంటివైపు కన్నెత్తి చూడకూడదని మాధవ అందరికి చెప్తాడు. ఆ తర్వాత గాయత్రిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తారు. గాయత్రిని తన పేరెంట్స్ బ్లాక్ మెయిల్ చేసి పెళ్లిచూపులకి ఒప్పిస్తారు. అబ్బాయికి అమ్మాయి నచ్చుతుంది. గాయత్రికి ఇష్టం లేకున్నా సరే అంటుంది. ఇరుకుటుంబాలు తాంబులాలు పుచ్చుకుంటారు. ఆ తర్వాత మహా హాల్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి చక్రి వస్తాడు. అప్పుడే గాయత్రి వస్తుంది. నాకు పెళ్లి కుదిర్చారని ఏడుస్తుంది. నువ్వు దైర్యం చేసి బయటకు వస్తే తన తమ్ముళ్లు దగ్గర ఉండి పెళ్లి చేస్తారని మహా అంటుంది.

అదంతా నారాయణ విని ఎన్నిరోజులు భయపడుతావ్..ఎన్నిరోజులు పిరికిదానిలా ఉంటావనుకుంటే దొడ్డిదారిన వెళ్ళు.. దైర్యం చేసి ముందడుగు వేస్తానంటే గుమ్మం గుండా వెళ్ళమని నారాయణ అనగానే గాయత్రి ఏడుస్తూ దొడ్డి దారిన వెళ్తుంది. దాంతో నారాయణ డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత వర్క్ ఉందని మహా ఇంట్లో నుండి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందని చక్రి తనని ఫాలో అవుతాడు. మహా తన వదిన హారికని కలిసి మాట్లాడుతుంది. అసలు ఏ పరిస్థితిలో చక్రిని పెళ్లి చేసుకుందో చెప్తుంది. చక్రి వాళ్ళకి దూరంగా వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ట్రై చేస్తాడు. తరువాయి భాగంలో చక్రికి మహా విడాకులు ఇస్తానని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com