Podharillu : ఇక తిరిగి రానని చెప్పేసిన మహా.. తనని చక్రి ఇంటికి తీసుకెళ్తాడా!
on Jan 28, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -37 లో.....మహా వాళ్ళ నాన్నని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తుంది కానీ వాళ్ళ అమ్మ చూడనివ్వదు. మహాని హారిక పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. ఇప్పుడు అందరు కోపం మీద ఉన్నారు. నువ్వు మా ఇంటికి వెళ్ళు ఫోన్ లో టచ్ లో ఉండమని హారిక పంపిస్తుంది. ఆ తర్వాత మహా, హారిక వాళ్ళ అమ్మ వాళ్ళింటికి వస్తుంది. హారిక వాళ్ళ నాన్న చూసి ఆ అబ్బాయి అయితే ఇంట్లోకి వద్దు నువ్వు ఒక్కదానివే రా అని చెప్తాడు.
దాంతో చక్రి కారు దగ్గర ఉంటాడు. హారిక పేరెంట్స్ తో మహా మాట్లాడి చక్రి దగ్గరికి వస్తుంది. వాళ్ళు నాతో అవమానంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఇంకెలా చూస్తారు. మీరు వెళ్లిపోండి ఇక రేపు మా నాన్నని కలిసి నిజం చెప్తాను. ఆ పెళ్లి నుండి తప్పించుకోవడానికి ఇలా చేసానని చెప్తాను. ఇక నిజం తెలిసాక నేను మీ ఇంటికి వచ్చే అవసరం లేదు. మీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారని మహా అంటుంది. మీరు అలా అప్పగింతలు చెప్పినట్లు మాట్లాడుతుంటే బాధగా ఉందని చక్రి అంటాడు. నాకోసం చాలా రిస్క్ తీసుకున్నారని మహా అంటుంది. మహా వెళ్లిపోతుంటే చక్రికి ఏడుపొస్తుంది. ఆ తర్వాత నారాయణ ఇంటికి వస్తాడు. చక్రి, మహా ఎందుకు వెళ్లారోననే విషయాన్ని నారాయణకి మాధవ చెప్తాడు. మళ్ళీ ఆ అమ్మాయి వస్తుందంటావ అని నారాయణ అంటాడు. వచ్చాక అందరికి తెలిసేలా రిసెప్షన్ చేయాలని మాధవ వాళ్ళు అనుకుంటారు.
ఆ తర్వాత మహా ఏమైనా తిందో లేదోనని చక్రి ఫుడ్ ఆర్డర్ చేసి లోపలికి పంపుతాడు. ఎవరు పంపారని మహా అడుగుతుంది. తెలియదని డెలివరీ బాయ్ అంటాడు. మహా తింటుందో లేదో అని చక్రి గేట్ ముందు నిల్చొని చూస్తాడు. ఆ తర్వాత హారిక ఫోన్ చేస్తుంది. రేపు ప్రొద్దున హాస్పిటల్ కి రా అని చెప్పగానే మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



