మొదటి సారి బుల్లితెర షోలో గారెలేసిన వెంకీ మామ
on Jan 15, 2025
"ఈ సంక్రాంతికి వస్తున్నాం" అనే మూవీ ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఆడియన్స్ అందరినీ తెగ అలరించేసింది. ఇక ఈ మూవీ టీమ్ మొత్తం కూడా స్టార్ మాలో ప్రసారమైన "ఈ సంక్రాంతి వేడుక" షోకి వచ్చారు. మొదటిసారి బుల్లితెర మీద ఇలాంటి ఒక షోకి వచ్చి వెంకటేష్ ఆడియన్స్ ని అలరించారు. ఇక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, భీమ్స్ సిసిరోల్ కూడా వచ్చారు. ఇక వెంకీ మామతో శ్రీముఖి ఎన్నో విన్యాసాలు చేయించింది. వెంకీ మామ కూడా ఫుల్ ఎంజాయ్ చేసారు. అలాగే సీనియర్ నటులు, ట్రెండింగ్ నటులు చెప్పిన తీన్ మార్ డైలాగ్స్ ని వెంకీ మామ చాల శ్రద్దగా విని మరీ ఎంజాయ్ చేశారు. ఇక దీపికా రంగరాజు వెంకీ మామనే ఆట పట్టించింది. అలాగే వెంకీ మామ ఐశ్వర్య రాజేష్ ఫేస్ కి కళ్ళు పెయింట్ చేసి డాన్స్ చేశారు. ఆ తర్వాత వెంకీ మామతో శ్రీముఖి గారెలేయించేసింది. వెంకటేష్ కూడా చాలా స్పోర్టివ్ గా వచ్చి గారెలు వేశారు. ఇక స్టేజి మీద ఉన్న అందరి ఆనందం అంతా ఇంతా కాదు.
"ఆన్ స్క్రీన్ లో గారెలేస్తున్నారు కానీ ఇంట్లో ఎప్పుడైనా గారెలు వేసారా" అని శ్రీముఖి అడిగింది. " గారెలు వేయడం ఇదే మొదటి సారి. కానీ నేను ఇంట్లో కోడి కూర, కోడి పులుసు, కీమా చేస్తాను" అని చెప్పారు వెంకటేష్. ఇక వెంకీ మామ వేసిన గార్లకు అవినాష్ వేలం పాట పెట్టాడు. ఫైనల్ గా పది లక్షలకు బేరం కుదిరేసరికి వెంకీ మామ ఐతే ఆ పది లక్షలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఎక్స్ ప్రెస్ హరి ఐతే లక్షల మంది అభిమానం మీకు ఉండగా లక్షలు ఎం చేసుకుంటారు అని పంచ్ వేసాడు. వెంటనే వెంకీ మామ అమ్మో అందరూ పంచులు మీద పంచులు వేస్తున్నారుగా అంటూ ఫుల్ ఎనెర్జీతో మాట్లాడారు. ఇక ఆ గారెలు ఐశ్వర్య రాజేష్ కి, అనిల్ రావిపూడి, హరికి, అవినాష్ కి, దీపికాకు ముక్కలు చేసి మరీ తినిపించారు. దాంతో అందరూ ఫిదా ఇపోయారు. ఇంతలా ఏ హీరో కూడా స్టేజి మీదకు వచ్చి ఇలా గారెలు వేసి తినిపించిన వాళ్ళు లేరు అంటూ శ్రీముఖి చెప్పేసరికి అందరూ చప్పట్లు కొట్టారు.
Also Read