బిగ్ బాస్‌లో నోరు జారిన కిర్రాక్ సీత.. ప్రేరణ, సోనియా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్
on Sep 9, 2024
బిగ్ బాస్ రెండవ వారం నామినేషన్ ప్రక్రియ హీటెట్ ఆర్గుమెంట్స్ తో మొదలయ్యిందని ప్రోమో చూస్తూనే అర్థమవుతుంది. నువ్వా నేనా అన్నట్టు హౌస్ మేట్స్ మధ్య గొడవ ముదిరింది. మాములుగా అయితే ఇలాంటి ఫైట్స్ అయిదు వారాలు తర్వాత మొదలవుతాయి కానీ మనోళ్లు ఫుల్ ఆన్ ఫైర్ మీద ఉన్నారు వారం రోజుల్లో దాదాపుగా ఒకరంటే ఒకరికి పడట్లేదు.
ఇక హౌస్ లో ఎప్పటిలాగే ఒక గ్రూప్ స్టార్ట్ అయింది అలాగే ఒక ప్రేమ జంటకి బిగ్ బాస్ వేదిక కాబోతుంది. అది ఏంటని ముందు ముందు తెలుస్తుంది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. ప్రతీ ఒక్కరు ఇద్దరు సభ్యులని నామినేట్ చేయాలి. నామినేషన్ లో ఎవరు ఎవరిని నామినేషన్ చెయ్యాలనుకున్నారో వాళ్ళ తల మీద కలర్ పోసి రీజన్ చెప్పాలని బిగ్ బాస్ కోరాడు. ఇలాంటి టైప్ నామినేషన్ అనేది ప్రతి సీజన్లో ఉంటూ వస్తోంది. ప్రేరణని కిర్రాక్ సీత నామినేట్ చేస్తూ.. మీరు అందరు గ్రూప్ గా బయట నుండే వచ్చారు. మీరు అలా అందరిని ఫాలో అవ్వమనడం కరెక్ట్ కాదని కిర్రాక్ సీత అనగా.. బయట నుంచి, బయట నుంచి వచ్చారని మొదటి నుండి అంటున్నారు అది తగ్గించండని, రాంగ్ గా పొట్రై చెయ్యొద్దని ప్రేరణ అంది.
ఇక కిర్రాక్ సీతకి సోనియాకి మధ్య మాటల యుద్ధం జరిగింది. అలాగే ఆదిత్య ఓం ని అభినయ్ నవీన్ నామినేట్ చేశాడు. హౌస్ లో ఇన్వాల్వ్ మెంట్ తక్కువగా ఉందని నామినేషన్ రీజన్ చెప్పగా.. మణికంఠ కన్నా తక్కువగా ఉందా అంటు ఆదిత్య అన్నాడు. సోనియా, నైనిక మధ్య కూడా హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ వారం ఎంతమంది నామినేట్ అయ్యారో ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read