పెళ్ళయ్యాకా నా మొగుడు ఇచ్చినా అంతా హ్యాపీగా ఉండదేమో
on May 17, 2025
కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ శనివారం షో ఫుల్ జోష్ గా కలర్ ఫుల్ గా సాగింది. ఈ వారం ఈ ఎపిసోడ్ ని లవ్ థీమ్ గా జరుపుకున్నారు. ఇందులో బాయ్స్ అండ్ గర్ల్స్ జంటలుగా వచ్చారు. అలాగే అబ్బాయిలు వాళ్లకు వచ్చిన ఫస్ట్ రెడ్ రోజా పూలను పుస్తకంలో దాచుకున్నారు అంటూ అనసూయ చెప్పింది. శ్రీముఖి కూడా అలాగే చేసింది అనేసరికి ఆమె ఒక ఇంటరెస్టింగ్ విషయాన్ని చెప్పింది. "భోళా శంకర్ మూవీ టైములో వాలెంటైన్స్ డే రోజున చిరంజీవి గారితో షూట్ చేస్తున్నాం. అందరూ షూట్ మూడ్ లో ఉంటే నేను మాత్రం చిరంజీవి గారి దగ్గరకు వెళ్లి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పాను. నేను అలా చెప్పిన వెంటనే ఆయన ఒక క్రేజి లుక్ కూడా ఇచ్చారు.
షూటింగ్ ఐపోయాక ప్యాకప్ ఐపోయే టైంకి చిరంజీవి గారు నన్ను పిలిచి చాలా రెడ్ రోజెస్ ఇచ్చారు. అన్ని రెడ్ రోజెస్ ఇచ్చేసరికి ఐపాయ్ నా పని..అప్పుడు కీర్తి సురేష్ గారు కూడా అక్కడే ఉన్నారు. అదేంటండి నాకు ఇవ్వరా రెడ్ రోజెస్ అని అడిగారు చిరంజీవి గారిని. అప్పుడాయన శ్రీముఖి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పింది. నువ్వు వచ్చి చెప్పావా శ్రీముఖి చెప్పింది అందుకే ఇచ్చాను అని చెప్పారు. అది బెస్ట్ మోమెంట్. నేను ఒక రోజ్ ని నా బుక్ లో పెట్టుకున్నా. నాకు తెలిసి నాకు పెళ్ళయాక నా మొగుడు రెడ్ రోజెస్ ఇచ్చినా కానీ అంత హ్యాపీనెస్ ఉండదేమో..." అని శ్రీముఖి చెప్తుండగా మధ్యలో విష్ణు ప్రియా వచ్చి "అరే వాడు అసలు రాడు. నువ్వు ఈ విషయం చెప్తే వచ్చేవాడు కూడా రాడు" అని కౌంటర్ ఇచ్చింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో పృద్వి విష్ణుప్రియాను ఎత్తుకుని వచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
