కేతికతో శేఖర్ మాస్టర్ "అదిదా సర్‌ప్రైజు"
on Apr 29, 2025
.webp)
డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమోలో ఎప్పుడూ మానస్ మీద ఫైర్ అయ్యే ప్రాకృతి ఒక్కసారిగా ఏడుపందుకుంది. ఈ ఎపిసోడ్ కి "సింగిల్" మూవీ టీమ్ నుంచి శ్రీ విష్ణు, కేతిక శర్మ వచ్చారు. రావడమే "రాబిన్ హుడ్" మూవీలోని అడిడా సర్ప్రైజ్ అంటూ స్టెప్పులేశారు కేతిక - శేఖర్ మాష్టర్. ప్రీఫైనల్స్ కి థీమ్ గా ది వైనింగ్ యాక్ట్ ఇచ్చాడు యాంకర్ ఓంకార్. ముమైత్ ఖాన్ కంటెస్టెంట్ అన్షికా వచ్చి "ఇరుక్కుపోయి" అంటూ బాహుబలి మూవీ సాంగ్ ని ప్రెజెంట్ చేసింది. ఆ సాంగ్ కి ఫారియా అబ్దుల్లా కూడా వచ్చి ఆ కంటెస్టెంట్ కలిసి డాన్స్ చేసింది. యష్ మాష్టర్ కంటెస్టెంట్ బినితా ఐతే జై లవకుశ మూవీ నుంచి "రావణ" సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ స్టెప్స్ చూసిన శ్రీవిష్ణు "ఇంత టాలెంట్ ఉన్నవాళ్లను నేను ఫస్ట్ టైం చూస్తున్నా" అంటూ పొగిడేసాడు. తర్వాత మానస్ కంటెస్టెంట్ చిరాశ్రీ వచ్చి కేజిఎఫ్ మూవీ నుంచి మదర్ సాంగ్ చేసింది.
ఆ సాంగ్ కి వేసిన స్టెప్స్ కి ముమైత్ ఖాన్ ఫుల్ ఫిదా ఐపోయింది. స్టేజి మీదకు వచ్చి ఆమె కాలికి నల్ల తాడు కూడా కట్టింది. ఆ మదర్ సెంటిమెంట్ కి అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రాకృతి కూడా బాగా ఏడ్చేసింది. "మా అమ్మను కూడా అలా ఒకసారి హాస్పిటల్ లో చూసాను. ఈ యాక్ట్ నాకు చాలా టచ్ అయ్యింది. నాకు అప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఉండేది" అని చెప్పింది. "ఈ టైంలో నువ్వు ఇలాంటి సాంగ్ తీసుకుని పెర్ఫార్మ్ చేయడానికి గట్స్ ఉండాలి" అంటూ శేఖర్ మాష్టర్ చెప్పారు. ఫైనల్ గా బర్కత్ ఐతే నెమలిలాగా నాట్యం చేసేసరికి స్టేజి మీద ప్రతీ ఒక్కరూ కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు. ఐతే ఈ ప్రీఫైనల్ కి అన్ని జోడీస్ ని పంపించేశాడు ఓంకార్. మరి నెక్స్ట్ వీక్ ఎవరు గెలుస్తారో ఎవలు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



