Home

»

Tv News

Podharillu : శైలుని బెదిరించిన వాళ్ళ అన్నయ్య.. కేశవ గురించి మహా తెలుసుకుంటుందా!

Mar 07, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -65 లో... మహా మళ్ళీ ఇంటికి తిరిగిరావడంతో చక్రిపై మాధవకి డౌట్ వస్తుంది. చక్రి దగ్గరికి వెళ్లి మహాకి రూమ్ ఇస్తానన్న అతని దగ్గరికి వెళ్లి బెదిరించావ్ కదా అని అడుగుతాడు. అంత బానే మేనేజ్ చేసానే ఎలా దొరికిపోయానని చక్రి అనగానే నీ ఓవరక్షన్ కి నాకు డౌట్ వచ్చిందని మాధవ అంటాడు. ఈ విషయం మహాకి తెలిస్తే బాధపడుతుందని మాధవ అనగానే తను బాధపడుతుందని అంటున్నావ్ కానీ మహాలక్ష్మి దూరం అయితే నేను ఎంత బాధపడుతానో అర్థం చేసుకోవా అని చక్రి అంటాడు.

మహా నన్ను ఎలా చూస్తుందో తెలియదు కానీ నాకు తను భార్యే అని చక్రి అంటాడు. మరొకవైపు కేశవకి డబ్బు ఇచ్చి తన ఫోన్ తీసుకోవాలని శైలు అనుకుంటుంది. వాళ్ళ అమ్మని అడగాలని వెళ్తుంది కానీ తను కోపంలో ఉందని అడగకుండా వెనక్కి వస్తుంది. శైలు దగ్గరున్న ఫోన్ డమ్మీ ఫోన్ అని శైలు వాళ్ళ అన్నయ్యకి తెలుస్తుంది. అమ్మతో చెప్తానని అంటాడు. వద్దని శైలు రిక్వెస్ట్ చేస్తుంది. అయితే ఒక అయిదు వందలు ఇవ్వు అని శైలుని వాళ్ళ అన్నయ్య బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరొకవైపు రాత్రి అందరు హాల్లో పడుకుంటారు. అప్పుడే నారాయణ వచ్చి చక్రిని నిద్ర లేపి నీకు పెళ్లి అయింది. వెళ్లి గదిలో పడుకోమని పంపిస్తాడు. చక్రి వెళ్లి మహా రూమ్ లో కిందపడుకుంటాడు. అప్పుడే మాధవ వచ్చి చక్రిని బయటకు రమ్మని చెప్తాడు థాంక్స్ పెద్ది అని మహా చెప్తుంది. అదంతా కేశవ చూస్తాడు. 

మరుసటి రోజు ఏంటి అన్నయ్య నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను కానీ నువ్వు చేసింది ఏం నచ్చడం లేదు.. నాన్న వచ్చి చక్రిని వదిన రూమ్ కి పంపించాడు. నువ్వు ఎందుకు మళ్ళీ బయటకు రప్పించావ్.. వాళ్ళు భార్యాభర్తలు కాదా ఎందుకు అలా విడగొడుతున్నావని మాధవని కేశవ అడుగుతాడు. అది కాదు చక్రి నాకు పెళ్లి అయ్యేంత వరకు దూరంగా ఉంటానని అన్నాడు కదా అందుకేనని మాధవ అంటాడు. నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావని కేశవ అనగానే నీకు నేను ఎలా చెప్పాలిరా మహా తప్పని సరిపరిస్థితి లో పెళ్లి చేసుకుందని మాధవ తనలో తానే అనుకుంటాడు. మరొకవైపు కన్నా చదువుకుంటుంటే మహా వస్తుంది. నువ్వు టాపర్ వి కదా అని అడుగుతుంది. చక్రి అన్నయ్య చెప్పాడా.. వాడు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలని కన్నా అంటాడు. మీ కేశవ అన్నయ్య ఏం చేస్తాడని మహా అడుగుతుంది‌ చెప్తాను కాని నువ్వు మళ్ళీ చక్రితో గొడవపడి వెళ్ళిపోకూడదని కన్నా అంటాడు. సరేనని మహా అంటుంది. కేశవ అన్నయ్య ఏం చేస్తాడో చూపిస్తానని మహాని వెంటపెట్టుకొని కన్నా వెళ్తాడు. తరువాయి భాగంలో చక్రి, మహా రిసెప్షన్ ఫోటో ని నారాయణ తీసుకొని వచ్చి గోడకి పెడతాడు. అది చూసి మహా షాక్ అవుతుంది. చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com