Brahmamudi : రాజ్ ని తీసుకొస్తానంటూ కావ్య శపథం.. యామిని తనని మార్చగలదా!
on Mar 20, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -673 లో....రాజ్ చనిపోయడని దుగ్గిరాల కుటుంబం మొత్తం నమ్ముతుంది. కర్మకాండ జరిపిస్తూ ఉంటుంది. ఒకవైపు ఇందిరాదేవి మరొకవైపు అపర్ణ ఇద్దరు రాజ్ ని తలుచుకుంటు ఏడుస్తుంటారు. సుభాష్ చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంటుంది. కావ్య నిద్ర నుండి లేచేసరికి ఏదో మంత్రాలూ వినిపిస్తున్నాయని కిందకి వెళ్తుంది. అక్కడ జరుగుతున్న కార్యక్రమం చూసి కావ్య షాక్ అవుతుంది.
నా భర్త బ్రతికే ఉన్నాడు.. ఎందుకు ఇలా బ్రతికున్నవారికి ఇలా చేస్తున్నారంటూ కావ్య అంటుంది. భర్తని పోగొట్టుకొని మతిస్థిమితం లేనిదానిలాగా చేస్తున్నావంటూ కావ్యతో అపర్ణ అంటుంది. నన్ను నమ్మండి ప్లీజ్ మీరు ఇలా చేస్తే అక్కడ మా అయనకి ఏదైనా హాని కలుగుతుందని మోరపెట్టుకున్నా ఎవరు వినరు. దాంతో అక్కడున్న వస్తువులన్నీ విసిరేసి రాజ్ ఫొటో తీసుకుంటుంది కావ్య. దాంతో అందరూ షాక్ అవుతారు. నా భర్త బ్రతికే ఉన్నాడు. మీరు ఇక మీదట ఇలాంటి చేస్తే బాగోదంటూ అందరికి చెప్పి వెళ్తుంది కావ్య. కావ్య అంతలా చెప్తుంటే మనమే మూర్ఖంగా చేస్తున్నామని అపర్ణ అంటుంది. కావ్య చెప్పేది నాకు ఏం అర్ధం అవడం లేదని ఇందిరాదేవి అంటుంది. కావ్య చెప్పింది నిజం అయితే రాజ్ తనని చూసి ఎందుకు వదిలేసిపోతాడని సుభాష్ అంటాడు.
మరొకవైపు యామిని తన పేరెంట్స్ తో మాట్లాడుతుంది. రాజ్ అని వైదేహి అంటుంటే రాజ్ అనకు ఎన్నిసార్లు చెప్పాలి.. తను రామ్ అని వైదేహిపై యామిని కోప్పడుతుంది. బావ ఎవరో అమ్మాయిని చూసానని అంటున్నాడు. ఆ అమ్మయి తన ఫ్యామిలీ మెంబెరే అయి ఉంటుందా అని యామిని అంటుంది. తన ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటే రామ్ కి గతం గుర్తు లేదు కానీ తనకి గుర్తుంటుంది కదా.. తను అయినా రామ్ ని గుర్తు పట్టాలి కదా అని యమిని నాన్న అంటుంటే.. ఒకవేళ ఆ అమ్మాయికి మాట్లాడే సిచువేషన్ రాలేదేమో అని యామిని అంటుంది. తరువాయి భాగంలో రాజ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తానని కావ్యతో అప్పు చెప్తుంది. ఆ లోపే నా భర్తని నేను తిరిగి తీసుకొని వస్తానని కావ్య అంటుంది. మరొకవైపు కంపెనీ ని గుప్పెట్లోకి తీసుకోవాలని, అందుకోసం కావ్యని అడ్డు తొలగించాలని రాహుల్ రుద్రాణి అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
