కావ్య-నిఖిల్ ఇద్దరూ శుభలేఖలు ప్రింటింగ్ చేయించడమే కాదు వాళ్ళ పెళ్లి కూడా ఐపోయింది
on Jul 25, 2023
"నీతోనే డాన్స్" ఎపిసోడ్ లో డాన్స్ పెర్ఫామ్ చేసే జంటలతో శ్రీముఖి ఈ వారం లవ్ లెటర్స్ రాయించింది. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో అనే కాన్సెప్ట్ తో ఈ లెటర్స్ ని రాయించింది. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా అందంగా లెటర్స్ రాయడమే కాదు చదివి కూడా వినిపించారు. ఇక ఇందులో నిఖిల్, కావ్య గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. వీళ్ళ డాన్స్ కి జడ్జెస్ ఎప్పుడూ ఫిదా ఐపొతూ ఉంటారు. అలాంటి నిఖిల్ తన కావ్య కోసం లవ్ లెటర్ రాసాడు.
"ప్రియమైన కావ్య...నిన్ను మొదటి సారి చూసినప్పుడు నాలో తెలియని ఏదో సంతోషం...ఎలా పరిచయం అయ్యావో తెలియదు. ఎలా దగ్గరయ్యావో కూడా తెలియదు. కానీ నీలో మా అమ్మను, మా అమ్మ ప్రేమను చూస్తున్నాను, ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలీదు కానీ ఏదో చెప్పాలని అనిపిస్తుంది. నీ ఊరేమిటో తెలీదు కానీ ఊహించాను, నీ మనసేమిటో తెలీదు కానీ మనసు పడ్డాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఏ క్షణం మరువకుండా క్షణం క్షణం నిన్నే ప్రేమిస్తా" అని చెప్పేసరికి జడ్జెస్ తో పాటు శ్రీముఖి కూడా గట్టిగా జారీచేసింది. ఇక కావ్య ఐతే షాకయ్యింది. " నాకోసం లెటర్ రాసాడు కదా" దాని కోసమైనా అంటూ కావ్య నిఖిల్ నుదిటి మీద ముద్దు పెట్టేసింది..దీంతో శ్రీముఖి ఒక వీళ్ళ గురించి సెన్సేషన్ న్యూస్ కూడా చెప్పేసింది.
"వీళ్ళు శుభలేఖలు రాసుకున్నారు కానీ శుభలేఖలు ప్రింటింగ్ తో పెళ్లి కూడా ఐపోయింది" దానికి సంబంధించిన వీడియో తన దగ్గర ఉందని చెప్పింది. దయతో సదా, రాధ షాకింగ్ ఫేసెస్ పెట్టారు. " మనకు ఎవరికీ చెప్పకుండా చేసుకున్న వీళ్ళ పెళ్లిని మీరు చూసేయండి" అంటూ ఫన్నీ గా చేసిన ఒక వీడియోని ప్లే చేసి చూపించింది శ్రీముఖి. "ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ఈ వీడియో ఇంకా ఫుల్ గా ఉంది" అని శ్రీముఖి చెప్పింది. ఇక జడ్జి రాధా స్టేజి మీదకు వెళ్లి కావ్య- నిఖిల్ తో కలిసి డాన్స్ చేసింది. అలాగే శ్రీముఖి కొన్ని కొన్ని మాటలకు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో కూడా చేసి చూపించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
