Home

»

Tv News

Karthika Deepam2:పిల్లల్ని వద్దనుకున్నామని చెప్పిన కార్తీక్, దీప.. షాక్ లో శివన్నారాయణ ఫ్యామిలీ!

Mar 14, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-617 లో.. కార్తీక్, దీప, జ్యోత్స్న, పారిజాతం, కాంచన, శివన్నారాయణ, శ్రీధర్ , దశరథ్ అంతా కలిసి మాట్లాడుకుంటారు. రిపోర్ట్స్ ని బట్టి కార్తీక్, దీప అబద్ధం ఆడారని అందరికి తెలుస్తుంది. ఇక దీప, కార్తీక్ లని అందరు నిలదీస్తుంటే దశరథ్ నిజం చెప్పేసినట్టు కలగంటాడు. వెంటనే నో అని గట్టిగా అరుస్తాడు.  దాంతో ఏం అయింది డాడీ‌.‌ దీపని అడిగితే నువ్వు ఎందుకు కంగారుపడుతున్నావని జ్యోత్స్న అంటుంది.

ఏం అయిందని శివన్నారాయణ అడుగగా ఇంకా నిజం చెప్పకపోవడమే మంచిది అయిందని దశరథ్ అనుకొని ఏం లేదని అంటాడు. జ్యోత్స్న చెప్పినా నేను నమలేదు.. కానీ రిపోర్ట్స్ చూసాక నాకు మీ మీద నమ్మకం పోయిందని కార్తీక్ తో శివన్నారాయణ అంటాడు. అడుగు అత్త.‌. నీకు ఆ భాద్యత ఉందని జ్యోత్స్న అనగానే నేను ఆ భాద్యత తీసుకోవడం లేదని కాంచన అంటుంది. తాత ఇప్పుడు అవన్నీ ఎందుకు అని కార్తీక్ అనగానే.. నాకు ఇప్పుడు నిజం తెలియాలని కాంచన అరుస్తుంది. బావని ఏం అనొద్దు అని దీప అనగానే కార్తీక్ నువ్వు నిజం చెప్పకుండా ఇక్కడి నుండి వెళ్తే నేను చచ్చినంత ఒట్టే అని కాంచన అంటుంది. దాంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు అని కార్తీక్ అంటాడు. బావ నిజం చెప్పలేడు అత్త..ఎందుకు అంటే నేను బిడ్డని వద్దని అనుకుంటున్నానని దీప అనగానే అందరు షాక్ అవుతారు. మరోవైపు దాస్, కావేరి, స్వప్న, కాశీ మాట్లాడుకుంటారు. అసలు మీకు మీ పెళ్ళిరోజు అని జ్ఞాపకం ఉందా అని దాస్ అడుగుతాడు. గుర్తుంచుకునేంత గొప్ప రోజేం కాదని స్వప్న అనగానే అలవాటులో పొరపాటుగా నుదుటిపై సింధూరం దిద్దుకున్నావ్ కదా.. అది తుడిపేసెయ్ అని కావేరి అనగానే స్వప్న షాక్ అవుతుంది. ఎంత సంపాదించిన నిజాయితీని నమ్మకాన్ని పొందుతామా అని కాశీ గురించి స్వప్న అనగానే నా భర్త తప్పు చేయలేదా నేను సర్దుకొని కాపురం చేయడం లేదా అని కావేరి అంటుంది.

వాళ్ళకి ప్రైవెసీ ఇద్దామని కావేరి అంటుంది‌. పెళ్ళిరోజు నుండి ఇప్పటి వరకు మీ లైఫ్ లో జరిగినవన్నీ గుర్తుచేసుకొని కలిసిపోండి అని దాస్ చెప్పి వెళ్తాడు. మరోవైపు దీప, కాంచన, జ్యోత్స్న, కార్తీక్ , మాట్లాడుకుంటారు. నాకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని దీప అనగానే ఎందుకు ఇష్టం లేదో చెప్పవే, అసలు నాకు ఎందుకు మాట ఇచ్చావో కూడా చెప్పవే అని దీపతో కాంచన అంటుంది. ఒక్కనిమిషం అత్తా డాక్టర్ ఇప్పుడే ఒక వాయిస్ మెసెజ్ పంపించింది. అది కూడా విన్నాక మనం మాట్లాడుదామని జ్యోత్స్న అంటుంది. 

దీపకి ఈ కాన్పు తర్వాత ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. అంటే ఇప్పుడు దీప పిల్లల్ని కనాలని అనుకోవడం లేదు కాబట్టి నీ కొడుకు పిల్లల్ని నువ్వు చూడాలనుకునే నీ కల ఎప్పటికి కలగానే మిగిలిపోతుందని జ్యోత్స్న అంటుంది. దీప ఈ విషయం నీకు ముందుగానే తెలుసా అని శ్రీధర్ అనగానే తెలుసని దీప అంటుంది. ఇలాంటి బుద్ది లేని నిర్ణయాన్ని ఎలా తీసుకున్నావని శ్రీధర్ అనగానే దీపని ఏం అనొద్దని ఈ నిర్ణయం మా ఇద్దరిది అని కార్తీక్ అంటాడు.  రేయ్ కార్తీక్ అలా ఎలా మాట్లాడుతున్నావ్ రా అని కాంచన అనగానే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ నిర్ణయం నాదే అని కార్తీక్ అంటాడు. సుమిత్ర ప్రాణం కాపాడాలని ఇక్కడ ఇంతమంది చూస్తుంటే మీరేమో ఒక ప్రాణాన్ని అలా ఎలా వద్దనుకుంటార్రా కార్తీక్ అని శివన్నారాయణ ఎమోషనల్ అవుతాడు.

దశరథా అడుగు దీపని నీ కన్నకూతురులాగా చూసుకున్నావ్ కదా అని శివన్నారాయణ అనగానే అడుగలేడు అని పారిజాతం అంటుంది. ఎందుకని శివన్నారాయణ అడగగా దీప వద్దనుకుంటుంసని తనకి ముందే తెలుసు అని పారిజాతం అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. వాళ్ళు వద్దనుకుంటున్నారని నీకు ఎప్పుడు తెలుసు అని శివన్నారాయణ అడుగగా ఎప్పుడో తెలుసని పారిజాతం అంటుంది. ఎప్పుడో తెలిసినదానివి అప్పుడే ఎందుకు చెప్పిసావలేదని పారిజాతంపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com