కస్తూరికి ఆ కలర్స్ అంటేనే ఇష్టమట!
on Jun 11, 2022
సాయంత్రం అయ్యేసరికి స్టార్ మాలో వచ్చే 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ లో పద్దతిగా చాలా హోమ్లీగా కనిపించే కస్తూరిలో మరో యాంగిల్ కూడా ఉంది. రకరకాల డ్రెస్సుల్లో దర్శనమిస్తూ మెరుస్తూ ఉంటుంది. తన కొడుకుతో కలిసి షార్ట్స్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరేమనుకున్నా పట్టించుకోని కస్తూరి తనకు నచ్చిందే చేస్తుంది. తనకు పింక్ అన్నా, బ్లూ కలర్ అన్నా చాలా ఇష్టం.
ఎక్కువగా తన వీడియోస్ లో ఈ రెండు కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు 'గృహలక్ష్మి' సీరియల్ లో ఎక్కువ శాతం బ్లూ అండ్ పింక్ కాంబినేషన్స్ ఉన్న శారీస్ తోనే ఎక్కువగా కనిపిస్తుంది కస్తూరి శంకర్. ఇక ఇటీవల బ్లూ కలర్ డ్రెస్ లో బ్యాగ్రౌండ్ పింక్ తో అందంగా కనిపించే వాల్ పెయింటింగ్ తో ఒక అందమైన ఫోటో చాలా వ్యూస్ అందుకుంటోంది. ఇది చూసి నెటిజన్స్ 'మేడం మీకు పింక్ కలర్ అంటే ఇష్టమా. చాలా బాగున్నారు. ఏంజిల్ లా ఉన్నారు' అంటూ కామెంట్స్ ఇస్తున్నారు.
Also Read