Home

»

Tv News

Karthika Deepam2: జ్యోత్స్న, మాలిని ఒక్కటే అన్న సూరజ్.. షాక్ లో తల్లి!

Nov 13, 2026 8:19AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -828 లో.. సూరజ్ ఇన్వెస్టర్ ని లాక్కొని వచ్చి జ్యోత్స్న దగ్గర తోసేస్తాడు. జ్యోత్స్నకి సారీ చెప్పమని అంటాడు. ఆఫ్ట్రాల్ ఓ ఉద్యోగి కోసం నన్నే కొడతావా అని ఇన్వెస్టర్ అంటే, ఆఫ్ట్రాల్ ఉద్యోగి కాదు తను నా మనిషి, నా సొంతం అని ఆగిపోయి నా పీఏ అని చెప్పి సారీ చెప్పమంటాడు. జ్యోత్స్నకి అతన్ని లాగిపెట్టి కొట్టమని అంటాడు. జ్యోత్స్న లాగిపెట్టి కొడుతుంది. అతను జ్యోత్స్నకి సారీ చెప్తాడు. ఇంకోసారి ఎవరైనా ఇలా చేస్తే నాకు చెప్పండని చెప్పి సూరజ్ వెళ్లిపోతాడు. జ్యోత్స్న ఓకేనా అని దీప అడిగితే, సగం ఓకే కొంచెం బ్యాలెన్స్ ఉందని మాలిని దగ్గరకు వెళ్తుంది. దీప ఆపాలని చూస్తే వద్దు వెళ్లని, మాలిని పిన్నికి అప్పుడప్పుడు ఇలా చేయాలని అంటాడు.

మాలిని రగిలిపోతుంటే జ్యోత్స్న వెళ్లి, వెళ్లిపోతా అనుకున్నావ్ కదా అత్తా అని అంటుంది. నువ్వు శివన్నారాయణ మనవరాలివి కదా, అంత ఈజీగా వెళ్లవని మాలిని అంటుంది. దానికి జ్యోత్స్న.. శివన్నారాయణ మనవరాలినే కాదు, ఇప్పుడు నేను సూరజ్ గారి తాలూకా, నా గురించి మాట్లాడితే కాఫీ కప్పులు పగులుతాయ్.. నా మీద చేయి వేస్తే చెమటలు పట్టేస్తాయని అంటుంది. ఏదో కాస్త సపోర్ట్ చేస్తే ఇంత చేస్తావా అని మాలిని అంటే, కొంచెం ఏంటి అత్తా అంతా అయితే, ఇప్పటి వరకు నేను సూరజ్ తాలూకా కాదు, సూరజ్ ఈ జ్యోత్స్న తాలూకా, కావాలంటే నా ఐడీ కార్డు మీద జ్యోత్స్న సూరజ్ అని రాసుకుంటానని అంటుంది. వాడు నా కొడుకు అని మాలిని అంటే, నా ప్రియుడు అని జ్యోత్స్న అంటుంది. ఇద్దరూ సూరజ్ కోసం గొడవ పడతారు.అవసరం అయితే నీ కొడుకు నా కోసం ఏమైనా వదులుకుంటాడు.‌ నీతో సహా, ఇది రాసుకో ఓ పేపర్ మీద రాసుకో అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో నాని వచ్చి సూరజ్ పిలుస్తున్నాడని జ్యోత్స్నని పిలుస్తాడు. అత్త నీ కొడుకు నన్ను చూడకుండా ఉండలేడు.. నేను వెళ్లకపోతే నా కోసం వచ్చేస్తాడని అంటుంది. జ్యోత్స్న వెళ్లిపోయిన తర్వాత ఈ సారి నువ్వే గెలిచావ్, ఘోరంగా ఓడించి గెలిచావే అని మాలిని అంటుంది.

ఎందుకు ఈ విషయం నాకు చెప్పలేదని సూరజ్ అడుగుతాడు. నేను చెప్తే నమ్మరు సర్, ఇప్పుడు కూడా నేను చెప్పలేదు, నానీ చెప్పగానే ఇదంతా డ్రామా అని మీ అమ్మగారు అన్నారని జ్యోత్స్న అంటుంది. నేను నమ్మననుకున్నావా అని సూరజ్ అంటే అవును సర్ సాక్ష్యాలు లేకపోతే మీరు నమ్మరు.. నిరూపించే సాక్ష్యం నా దగ్గర లేదు అందుకే చెప్పలేదని జ్యోత్స్న అంటుంది. నువ్వు చెప్పింది నేను నమ్ముతాను.. ఎందుకు అంటే నాకు నువ్వు, మా అమ్మ ఒక్కటే అని సూరజ్ అంటాడు. ఏంటి సర్ అన్నారు, నేను మీ అమ్మ ఒక్కటేనా అని జ్యోత్స్న అంటే జీవితంలో చాలా తక్కువ మందికి విలువ ఇస్తా.. అందులో నువ్వు కూడా ఉన్నావని అంటాడు. నేను అడిగినా నువ్వు చెప్పలేదు, అందుకే నాకు నీ మీద బాగా కోపం వచ్చిందని అంటాడు. ఈ డీల్ మీకు ఎంత ముఖ్యమో తెలిసి ఎలా చెప్తానని జ్యోత్స్న అంటే నా తెలివితో తెచ్చుకున్న డీల్ ఇది.. ఇది కాకపోతే ఇంకొకటి తెచ్చుకుంటానని అంటాడు. నేను మీకు స్పెషలా అని జ్యోత్స్న అడిగితే, నువ్వు అందరి కంటే ఎప్పుడూ స్పెషలే అని సూరజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com