కార్తీక్ ని బావ అని పిలిచిన దీప.. షాక్ లో కాంచన, అనసూయ!
on Jun 15, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -384 లో.... దీపని మరదలు అని పిలుస్తాడు కార్తీక్. మీరు అలా పిలుస్తుంటే నాకు ఒకలా పిలవాలని ఉందని దీప అంటుంది. ఎలా అని కార్తీక్ అడుగగా.. నాకు సిగ్గుగా ఉంది పిలవలేనని మల్లెపూలతో బావ అని రాసి ఉంది చూపిస్తుంది. అది చూసిన కార్తీక్ మురిసిపోతాడు. రాసిందానివి పిల్వవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. దీప కాస్త సిగ్గుపడుతూ బావ అంటుంది. దాంతో కార్తీక్ గాల్లో తేలుతాడు.
ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. మరోవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. కార్తీక్ చెప్పినట్లు వింటున్నావేంటని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. నువ్వు కేక్ పడేసింది బావ వీడియో తీసి చూపించి, బ్లాక్ మెయిల్ చేసాడు.. అందుకే దీపతో కలిసి కేక్ కట్ చేసానని జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత సుమిత్రని దశరథ్ తీసుకొని వస్తాడు. ఎక్కడికి వెళ్లారని జ్యోత్స్న అడుగుతుంది. కాలు బెణికింది కదా హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళానని దశరథ్ అంటాడు. నీపై నాకు చాలా కోపంగా ఉంది. ఆ దీపతో కలిసి నువ్వు కేక్ కట్ చెయ్యడం ఏంటని జ్యోత్స్నపై సుమిత్ర కోప్పడుతుంది. సుమిత్ర, దశరథ్ వెళ్ళిపోతారు. చూసావా మమ్మీకి దీప అంటే చిరాకు పెరిగింది..అదే కదా మనకి కావాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. మరొకవైపు కార్తీక్ రెడీ అయి వచ్చి.. దీపని పిలుస్తాడు. వస్తున్నా బావ అని దీప అనగానే అనసూయ, కాంచన, శౌర్య ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



