సాయం కోసం శివన్నారాయణ దగ్గరికి వచ్చిన కాంచన, అనసూయ.. జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్!
on Jan 26, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -264 లో.....కార్తీక్ హాస్పిటల్ కి వచ్చేసరికి శౌర్య బెడ్ పై ఉండదు. దాంతో కార్తీక్ కంగారుపడుతూ అక్కడున్నా అందరిని అడుగుతాడు. దాంతో కార్తీక్ అక్కడున్నా డాక్టర్ నర్సులపై కార్తీక్ కోప్పడతాడు. కార్తీక్ వెతుకుతూ ఉంటే.. దేవుడికి మొక్కుతూ శౌర్యా కన్పిస్తుంది. దాంతో తమ దగ్గరికి వెళ్లి శౌర్యని హగ్ చేసుకొని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. చెప్పాలి కదా అని కార్తీక్ అడుగగా.. డాక్టర్ నాకు రేపేదో పెద్ద టెస్ట్ చేస్తానన్నాడు కదా అందుకే భయమేసి ఇక్కడ మొక్కుకుంటున్నానని శౌర్య అంటుంది.
జ్యోత్స్న కాఫీ తాగుతూ.. ఆ దాస్ బ్రతకకూడదని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దశరత్ వచ్చి జ్యోత్స్న ఇప్పుడు దాస్ గురించి ఆలోచిస్తుందనుకుంటా.. దాస్ త్వరగా కోలుకోవాలని దశరథ్ అనుకుంటాడు. అప్పుడే కాంచన, అనసూయలు శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. కాంచనని చూసి దశరథ్ ఎమోషనల్ అవుతాడు. సుమిత్ర ని పిలుస్తాడు. ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావని సుమిత్ర బాధపడుతుంది. నాన్న ఎక్కడ అని కాంచన అడుగుతుంది. అపుడే శివన్నారాయణ వచ్చి ఎవరు నువ్వు అంటూ తన మాటల్తో బాధపెడతాడు. నాకు సాయం కావాలని కాంచన అడుగుతుంది. నేను చెప్పాను కదా జ్యోత్స్న.. ఎప్పటికైనా నా దగ్గరికి వస్తారని అని శివన్నారాయణ అంటాడు. శౌర్యకి బాగోలేదు.. ఆపరేషన్ చెయ్యాలి.. లేకపోతే బ్రతకదని కాంచన చెప్పగానే.. అందరు షాక్ అవుతారు.
అయ్యో చంటి దానికి నిజంగానే బాగోలేదా అని శివన్నారాయణ అంటాడు. అప్పుడే అదంతా నాటకం తాతయ్య నమ్మకండి.. ఇది దీప ప్లాన్ అంటు శివన్నారాయణకు జ్యోత్స్న నూరిపోస్తుంది. దాంతో జ్యోత్స్న చెప్పేది నిజమనుకుంటాడు శివన్నారాయణ. తను అలా మాట్లాడుతుంటే జ్యోత్స్నపై చెయ్యి ఎత్తుతాడు దశరథ్. నా మనవరాలిని కాపాడమని కాంచన అనగానే.. ఎవరు నీ మనవరాలు.. నీ కొడుకుకి పుట్టిందా అంటూ శివన్నారాయణ మాట్లాడుతుంటాడు. అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



