Karthika Deepam2 : దీప కడుపులో బిడ్డ క్షేమం కోసం శివన్నారాయణ తపన.. తను ఒప్పుకుంటుందా!
on Dec 6, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -533 లో... దశరథ్, సుమిత్ర కలిసి దీపని తన బిడ్డ అనుకొని పసుపు కుంకుమతో సారె తీసుకొని వచ్చి ఇస్తారు. దాంతో దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తీక్, దీప ఇద్దరు సుమిత్ర, దశరథ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పుడు మీకొక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాం.. ఇక దీప నువ్వు పనికి రానవసరం లేదు.. నువు జాగ్రత్తగా ఉండాలని సుమిత్ర అనగానే దీప షాక్ అవుతుంది. నీకు ఏమైనా అవసరం ఉంటే అన్ని మేమ్ తీసుకొని వస్తామని దశరథ్ చెప్తాడు.
దీప రాకుంటే తన బిడ్డని ఎలా చంపాలని జ్యోత్స్న అనుకుంటుంది. నువ్వు దీపని అలాగైనా వచ్చేలా చెయ్ గ్రానీ అని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. లేదు అమ్మ నేను పనికి వస్తాను.. మా బావ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని దీప అనగానే.. నీ మాట నీకేనా, అర్ధం చేసుకోవాలి కదా అని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ రాకుంటే ఓకేనా అని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్న కొన్ని రోజులు కార్తీక్ రాడు అని శివన్నారాయణ అంటాడు. దానికి జ్యోత్స్న ఒప్పుకోదు. దీప మొండిగా బావ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటానని వాదిస్తుంది. ఇక నీ ఇష్టం అని శివన్నారాయణ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాంచన దగ్గరికి దీప వస్తుంది.
తనపై కాంచన కోప్పడుతుంది. ఒక్క బిడ్డ ఉంది చాలు.. కడుపులో బిడ్డ ఏమైతే నాకెందుకు అనుకుంటున్నావా.. అంతమంది చెప్తుంటే ఎందుకు వినట్లేదు.. నువ్వు ఒక స్వార్థపరురాలివి అని కాంచన అనగానే దీప షాక్ అవుతుంది. అక్క నేను చెప్పింది కరెక్టే కదా అని అనసూయని కాంచన అడుగుతుంది. కరెక్ట్ చెల్లి ఇది ఎంత మంది చెప్పినా వినట్లేదని కాంచన అంటుంది. నా రూపం నాకొడుకు.. వాడి రూపం నీ కడుపులో పెరుగుతుందని కాంచన ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



