Karthika Deepam2: కోర్ట్ లో ఇరికించేసిన జ్యోత్స్న.. భగవాన్ దాసు వాదన చూసి నిస్సహాస్థితిలో దీప!
on Apr 25, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-340లో.. కళ్యాణ్ ప్రసాద్, భగవాన్ దాసు ఇద్దరు పోటాపోటీగా వాదిస్తుంటారు. యువరానర్.. స్వయంగా దశరథ్ గారే వాంగ్మూలం ఇచ్చారు.. తనని కాల్చింది దీపే అని. పేషెంట్ బాడీలోంచి తీసిన బుల్లెట్.. అలాగే గన్‌ని ల్యాబ్‌కి పంపించిన రిపోర్ట్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల రిపోర్ట్స్ లేటు అయ్యాయి.. లేదంటే వాటిని కోర్టుకు సమర్పించే వాళ్లమని భగవాన్ దాసు మాట్లాడుతుంటే.. మరి ఏ సాక్ష్యంతో దీపే కాల్చిందని చెబుతున్నారని కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. దశరథ్ వాంగ్మూలం ఉంది.. అలాగే ప్రత్యక్ష సాక్షులు కూడా ఇక్కడే ఉన్నారు.. కార్తీక్ కూడా ప్రత్యేక్ష సాక్షే.. కావాలంటే విచారించుకోండి అని భగవాన్ దాసు అంటాడు. వెంటనే దీప ఏడుస్తూ.. జడ్జిగారు.. నేను గన్ పట్టుకున్నానంతే.. కాల్చలేదు.. జ్యోత్స్న నా కూతుర్ని చంపుతానన్న మాటలకు కోపంగా బెదిరించాను అంతే కానీ గన్ పేల్చలేదని అంటుంది. నువ్వు కాల్చకపోతే బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది.. నువ్వు పట్టుకున్న గన్‌లోంచే కదా బుల్లెట్ వచ్చిందని భగవాన్ దాసు అంటాడు.
ఇక ఇద్దరు లాయర్లు పోటాపోటీగా కేసుని వాదిస్తుంటారు. జ్యోత్స్న గొంతు పట్టుకోవడానికి ఎస్ఐ, కానిస్టేబుల్స్ అంతా సాక్ష్యులే.. కావాలంటే ఎస్ఐ గారిని అడగండి.. లేదంటే దీప గారినే అడగండి అని భగవాన్ దాసు అంటాడు. కార్తీక్ విడిపించాడు కాబట్టి సరిపోయింది. లేదంటే జ్యోత్స్న పోలీస్ స్టేషన్‌లోనే చనిపోయేది తెలుసా అని భగవాన్ దాసు అనగానే.. అవును సర్.. దీపలో నన్ను చంపాలన్నంత కోపం ఉంది..ఇప్పుడు కాకపోతే తర్వాత అయిన చంపుతుందని జ్యోత్స్న అంటుంది. మంచి మాట చెప్పారు జ్యోత్స్నా గారు.. దీప మీ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అంతా ఉన్నారా.. దీప మిమ్మల్ని చంపబోతుందని మీ నాన్నగారితోనో మీ తాతగారితోనో చెప్పకుండా నువ్వు గన్ ఎందుకు తీశావంటూ కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. ఆ టైమ్‌లో ఏం చెయ్యాలో తెలియలేదని జ్యోత్స్న భయంతో చేశానంటుంది. భయంతో చేయలేదు.. చాలా జాగ్రత్తగా దీపను ఇరికించాలని అలా చేశావని కళ్యాణ్ అంటాడు.
ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీప షూట్ చేసింది. బుల్లెట్ దశరథ్ గారికి తగిలింది. అంతా క్లియర్‌గా ఉంది.. ఈ హంతకురాలు తప్పించుకునే అవకాశం ఇవ్వకండి అని భగవాన్ దాసు అంటాడు. అబ్జెక్షన్ యువరానర్ అంటూ కళ్యాణ్ దాసు పైకి లేచి.. ఇంకా ఆధారాలు, రిపోర్ట్ రాలేదు. అందుకే ఈ కేసును వాయిదా వేయాల్సిందిగా కోర్టు వాళ్లను కోరుతున్నానని రిక్వెస్ట్ చేయడంతో జడ్జ్ కేసుని.. వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నాం.. అంతవరకు దీప రిమాండ్‌లో ఉంటుంది. బైల్ ఇవ్వలేమని తేల్చేస్తుంది. ఇక అంతా వెళ్లిపోతారు. దీప ఏడుస్తూ కార్తీక్ ముందు నిస్సహాయంగా వెళ్తుంది. మరోవైపు కార్తీక్ ఇంటికి వచ్చి.. శౌర్య ఏడుస్తుంటే.. మీ అమ్మను వచ్చే బుధవారం తీసుకొస్తానని మాటిస్తాడు. అదెలా సాధ్యమని కాంచన, అనసూయ అంటారు. నా కూతురికి మాటిచ్చాను.. తీసుకొస్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



