Karthika Deepam2: కోనేరులో ప్రాణధాత ప్రతిబింబం.. పట్టరాని సంతోషంలో దీప!
on Apr 5, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -323 లో....కార్తీక్ రెస్టారెంట్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. దీపా పద రెస్టారెంట్ కి అంటాడు. నేను రాను బాబు ఇక రెస్టారెంట్ కి.. అక్కడికి ఎవరో ఒకరు వస్తున్నారు.. మాటలు అంటున్నారు.. నా వల్ల మీరు మాటలు పడాల్సి వస్తుందని దీప బాధపడుతుంది. నేను మీ జీవితంలోకి వచ్చాను కాబట్టి మీరు అందరికి దూరమయ్యారు. పెళ్లిలు పైనే జరుగుతాయని అంటారు కానీ మన పెళ్లి భూమ్మీద జరిగింది. నేనొక బాటసారిని మాత్రమే మా నాన్న వల్ల కలిసాం.. నా కూతురు వల్ల పెళ్లి చేసుకున్నామని దీప తన లోని బాధని చెప్తుంటే కార్తీక్ మౌనంగా వింటాడు.
దీప మాట్లాడడం పూర్తయ్యాక కార్తీక్ దీప చెయ్ పట్టుకొని ఒక దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అది చిన్నప్పుడు కార్తీక్ ని దీప కాపాడిన గుడికి తీసుకొని వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడని దీప షాక్ అవుతుంది. ఈ ప్లేస్ గుర్తుందా నా ప్రాణధాత నన్ను కలిసిన చోటు.. ఇప్పుడు నా ప్రాణధాత ఇక్కడే ఉంది చూపిస్తానంటూ కార్తీక్ కోనేరు దగ్గరికి తీసుకొని వెళ్లి కోనేరులో దీప ప్రతిబింబం చూపిస్తాడు. అదిగో ఆవిడే అని కార్తీక్ అనగానే దీప షాక్ అవుతుంది. నువ్వే నా ప్రాణధాత అని నీక్కూడా తెలుసు.. నేను ఏదైనా సాధించాక చెప్పాలని అనుకున్నావ్.. నాకు నీ చిన్నప్పటి ఫోటో చూసాక తెలిసింది.. నువ్వే నా ప్రాణధాత అని కార్తీక్ అంటాడు.
నువ్వన్నావ్ కదా మన పెళ్లి భూమ్మిద జరిగిందని.. పైన జరగలేదు.. ఆల్రెడీ అక్కడ ముడివేసాడు కాబట్టి ఇక్కడ ఒకటయ్యాం మనకి రాసి పెట్టి ఉంది కాబట్టే మీ నాన్న ద్వారా కలిసాం.. శౌర్య ద్వారా ఒక్కటయ్యాం.. నువ్వు బాటసారివి కాదు నా భార్యవి అని కార్తీక్ తన ప్రేమని చెప్తుంటే దీపకి పట్టరాని సంతోషం వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
