Karthika Deepam2: ప్లేట్ తిప్పేసిన రమ్య.. అడ్డంగా బుక్కైన దీప!
on Apr 3, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -321 లో......గౌతమ్ మంచి వాడు కాదని నిరూపించడానికి రమ్యని తీసుకొని శివన్నారాయణ ఇంటికి వస్తుంది దీప.. రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి గౌతమ్ అని దీప చెప్తుంది. ఆ మాట తను చెప్పాలి కదా అని పారిజాతం అంటుంది. నా కడుపులో పెరుగుతున్నా బిడ్డ కి తండ్రి అని రమ్య టెన్షన్ పడుతుంటే.. అప్పుడే నేనే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని అంటూ సత్తిపండు ఎంట్రీ ఇస్తాడు.
దాంతో రమ్యతో పాటు దీప కూడా షాక్ అవుతుంది. ఏయ్ నువు అబద్ధం చెప్తున్నావని దీప సత్తి పండుని దబాయిస్తుంది. ఏంటి నేను అబద్దం చెప్పేది.. నువ్వే నా భార్యకి డబ్బిచ్చి అబద్దం చెప్పిస్తున్నావ్.. ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళు మా గల్లీలో ఇంటికి ఒకరు ఉంటారండి.. ఇప్పుడు మా ఆవిడ కూడా డబ్బుకి ఆశపడే ఇలా చేసిందని అతను చెప్తాడు. రమ్య అతను చెప్పేది అబద్ధమని చెప్పు అని దీప అంటుంది. ఆమ్మో వాడు మా వీధి రౌడీ.. వాడికి అడ్డు చెప్తే మా వాళ్ళని బ్రతకనివ్వడు అని రమ్య భయపడుతుంది. ఆ తర్వాత రమ్యని తీసుకొని సత్తిపండు వెళ్ళిపోతాడు. ఇక అందరు దీపని తిడతారు. సుమిత్ర అయితే దీప మనసు ముక్కలు అయ్యేలా మాట్లాడుతుంది. దీప ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అదంతా శ్రీధర్ కిటికిలో నుండి చూస్తాడు. గౌతమ్ మంచివాడు కాదా.. అందుకే దీప నిరూపించే ప్రయత్నం చేసింది. మళ్ళీ అతను ఎందుకు వచ్చాడు.. ఇందులో జ్యోత్స్నకి ఏమైనా సంబంధం ఉందా అని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న వంక చూస్తుంటే.. జ్యోత్స్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జ్యోత్స్న సత్తి పండుకి కాల్ చేసి డబ్బు పంపించాను.. ఆ రమ్య నోరు తెరావడానికి వీల్లేదని జ్యోత్స్న చెప్తుంది.
మరొకవైపు దాస్ కి గతం గుర్తు వచ్చి పేపర్ పై అసలైన వారసురాలు అంటూ రాస్తుంటాడు. అప్పుడే కాశీ, స్వప్న డాష్ ఇచ్చుకుంటారు. దాంతో స్వప్న చేతిలో గ్లాస్ కిందపడిపోగా దాస్ మళ్ళీ గతం మర్చిపోతాడు. ఆ పేపర్ కింద పడేస్తాడు. దీప ఎక్కడకి వెళ్ళిందని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడే దీప వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని కార్తీక్ అడుగగా.. ఎక్కడికి వెళ్ళిందో నీ భార్య చెప్పదు, నేను చెప్తానంటూ శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
