Karthika Deepam2 : శివన్నారాయణ ముందు దీప పెట్టిన సాక్ష్యం.. రమ్య బిడ్డకి తండ్రి ఎవరంటే!
on Apr 2, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-320 లో.....దీప వెళ్తుంటే ఒక కార్ తన ముందు ఆగుతుంది. తీరా చూస్తే అందులో నుండీ శ్రీధర్ దిగుతాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ ఇంకా ఏమైనా చెడగొట్టేటివి ఉన్నాయా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టేవి ఉన్నాయా అని దీపతో శ్రీధర్ వెటకారంగా మాట్లాడతాడు. తనకి సమాధానం చెప్పి దీప వెళ్ళిపోతుంది. అయినా ఈ దీప ఈ ఏరియాలో ఉందేంటని శ్రీధర్ అనుకుంటాడు.
ఆ తర్వాత శౌర్య స్కూల్ కి రెడీ అవుతుంటే కార్తీక్ వస్తాడు. దీప ఎక్కడ అని కార్తీక్ అడుగుతాడు. దీప ఇంటికి రాలేదని కాంచన అంటుంది. అయితే దీప ఎక్కడికి వెళ్లిందని ఆలోచిస్తాడు. శౌర్యా స్కూల్ బస్ వస్తుంది. నువ్వు వెళ్ళు అని బయటకు పంపిస్తాడు. అమ్మ దీప కన్పించడం లేదు రెస్టారెంట్ లో కూడా లేదని కాంచనతో కార్తీక్ చెప్తాడు. అయ్యో ఏమైందని కాంచన అడుగుతుంది. ఏముంది మీ నాన్న దీపని అనాల్సిన మాటలు అని వెళ్ళిపోయాడని కార్తీక్ చెప్తాడు. దీప వెళ్తుంటే గౌతమ్ మోసం చేసిన అమ్మాయి రమ్య ఎదరుపడుతుంది. తనతో గౌతమ్ గురించి చెప్తుంది. నువ్వు నాతో రావాలని తనతో జరిగింది చెప్తుంది.. అదంతా శ్రీధర్ చూసి ఇది మనకి ఉపయోగపడేలా ఉందని పారిజాతానికి ఫోన్ చేసి దీప ఎవరో అమ్మాయితో మాట్లాడతుందని చెప్తాడు. కానీ పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేసింది జ్యోత్స్న.. శ్రీధర్ చెప్పింది అంత విని థాంక్స్ మావయ్య అని అంటుంది. దీప సాక్ష్యం తీసుకొని వస్తుంది కావచ్చని జ్యోత్స్న అనుకుంటుంది.
రమ్యని తీసుకొని శివన్నారాయణ ఇంటికి వస్తుంది దీప. మీకు సాక్ష్యం కావాలన్నారు కదా ఇదిగో సాక్ష్యం ఈ అమ్మాయినే గౌతమ్ మోసం చేసాడు. ఇప్పుడు తన కడుపులో బిడ్డ కి తండ్రి గౌతమ్ అని దీప చెప్తుంది.. ఆ మాట నువ్వే చెప్పమని రమ్యకి దీప చెప్తుంది. ఎందుకు అంత సాగదీస్తున్నావని పారిజాతం అంటుంది. నా కడుపు లో బిడ్డకి తండ్రి అని రమ్య చెప్పబోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
