Karthika Deepam2 : మూర్ఖుడిలా తాత.. ఛాలెంజ్ లతో మనవడు!
on Jan 8, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -249 లో..... సుమిత్ర అందరికి భోజనం వడ్డీస్తుంది. ఇవి అయిన ఇంట్లో చేసినవా లేక మళ్ళీ ఎక్కడ నుండి అయినా తెచ్చావా అని పారిజాతం అడుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుండి నా వంట తింటున్నారు.. తెలియడం లేదా అని సుమిత్ర అంటుంది. అంటే కొన్ని వంటలు ఆ దీప నువ్వు సేమ్ వండుతారని పారిజాతం అనగానే.. తనపై శివనారాయణ కోప్పడతాడు. ఆ తర్వాత ఆఫీస్ లో నేను ఒక నిర్ణయం తీసుకున్నానని జ్యోత్స్న చెప్పగానే.. ఏదైనా తీసుకో అది మనకు పేరు తెచ్చేదిగా ఉండాలని శివన్నారాయణ అంటాడు.
మరొకవైపు మీరు రేపు వెళ్లి మీ తాతయ్యతో గొడవ పడకండి.. జ్యోత్స్న తీసుకున్న నిర్ణయం తాతయ్యకి తెలిసి ఉండదని దీప అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి మాట్లాడుతుంది. ఆఫీస్ లో ఏదో నిర్ణయమన్నావ్ ఏంటని పారిజాతం అడుగగా.. ఆఫీస్ లో నీలాంటి వాళ్ళందరిని తీసేసానని జ్యోత్స్న అంటుంది. దాంతో పారిజాతం షాక్ అవుతుంది. వచ్చిన ఛాన్స్ ని ఇలా చెడగొట్టకుంటున్నావ్ ఏంటి? ఆ నిర్ణయం మార్చుకో మీ తాతయ్యకి తెలిస్తే బాగోదని పారిజాతం భయపడుతుంది. అదేంటి తాతయ్య నిర్ణయం నాకు నచ్చినట్ల తీసుకొమ్మని చెప్పాడని జ్యోత్స్న అంటుంది.
మరుసటి రోజు ఉదయం శివన్నారాయణ ఇంటి ముందుకి కార్తీక్ వచ్చి శివన్నారాయణ గారు అంటూ పేరు పిలుస్తాడు. దాంతో అందరు బయటకు వస్తారు. పేరు పెట్టి పిలుస్తున్నావంటూ శివన్నారాయణ అడుగుతాడు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాను. ఆఫీస్ లో నిర్ణయలా గురించి అని కార్తీక్ అనగానే.. సీఈఓగా నా మనవరాలు నిర్ణయాలు తీసుకుంటుంది. తనేం చేసిన ఆ నిర్ణయం నేను సమర్థిస్తాను.. నువ్వు అడగాల్సిన అవసరం లేదని శివన్నారాయణ అంటాడు. అయితే నేను మాట్లాడడానికి వచ్చాను.. మీరు మాటలు వద్దు యుద్ధనే కావాలంటున్నారు తేల్చుకుంటానని చెప్పేసి కార్తీక్ వెళ్ళిపోతాడు. కార్తీక్ ఏం చెప్పే వాడో వినాల్సింది నాన్న అని దశరథ్ అంటాడు. వాడు అన్ని మనతో కలవడానికి చేస్తున్న ప్రయత్నమంటూ శివన్నారాయణ అంటాడు. అసలు బావ ఏం చేయబోతున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read