Karthika Deepam2 : కూతురికిచ్చిన మాట కోసం దాస్ వెనుకడగు.. సుమిత్ర ఇచ్చిన షాక్ అదే!
on Jan 6, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -247 లో..... కార్తీక్ సైకిల్ పై వస్తుంటాడు. అప్పుడే శ్రీధర్ కార్ లో వస్తాడు. సైకిల్ కి డాష్ ఇవ్వబోతుంటే.. కళ్ళు కన్పించడం లేదా అని కార్తీక్ అంటాడు. అప్పుడే శ్రీధర్ కార్ లో నుండి దిగి.. న్యూ లుక్ బాగుంది రా నేను చెప్పినట్టు వింటే ఈ పరిస్థితి రాదు కదా అని అంటాడు. కార్తీక్ పరిస్థితిని చూసి శ్రీధర్ ఒకవైపు జాలి చూపిస్తూనే మరోవైపు ఎగతాళి చేస్తాడు. దాంతో కార్తీక్ తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
మరొకవైపు సుమిత్రని దాస్ తీసుకొని దీప టిఫిన్ సెంటర్ దగ్గరికి వస్తాడు. కాంచనని చూసి ఎలా ఉండేవాళ్లు ఎలా అయిపోయారని సుమిత్ర బాధపడుతుంది. వాళ్లకి కనిపించకుండా ఆటోలో కూర్చొని ఉంటుంది. దీపని చూసి సుమిత్ర బాధపడుతుంటే.. తనే నీ కూతురు అని చెప్పలేకపోతున్నాను.. ఎందుకంటే జ్యోత్స్నకి మాటిచ్చాను.. అది తప్పి జ్యోత్స్నని దూరం చేసుకోలేనని బాధపడతాడు. నాకు దీప చేసిన టిఫిన్ తినాలని ఉందని సుమిత్ర అనగానే.. దాస్ ఆటో డ్రైవర్ తో టిఫిన్స్ తెప్పిస్తాడు. అప్పుడే కార్తీక్ వచ్చి ఏంటి అత్త ఇక్కడి వరకు వచ్చి అమ్మని కలవకుండా వెళ్తున్నావని కార్తీక్ అనగానే నేను ఎదురుడలేనని సుమిత్ర అంటుంది. మళ్ళీ అందరం కలిసి ఉండాలని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత సుమిత్ర వెళ్ళిపోయాక దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. ఎవరితో మాట్లాడారని అడుగగా కావలసిన వారు అని కార్తీక్ అంటాడు.
మరొకవైపు పారిజాతం రెడీ అవుతుంటే.. గ్రానీ టిఫిన్ చేద్దాం అని జ్యోత్స్న అంటుంది. పదా అని ఇద్దరు టిఫిన్ చెయ్యడానికి వస్తారు. వాళ్లు వచ్చేకంటే ముందు సుమిత్ర తెచ్చిన టిఫిన్స్ అన్నీ సెట్ చేస్తుంది. అందరు టిఫిన్ చేస్తూ టిఫిన్ ఈ రోజు బాగుందని అంటుంటే.. నిజంగా బాగున్నాయా.. ఇలాంటివి టిఫిన్ సెంటర్ లో ఉంటాయి అంటారా అని సుమిత్ర అంటుంది. ఇలాంటి టేస్ట్ వి టిఫిన్ సెంటర్ లో ఉండే ఛాన్స్ లేదని జ్యోత్స్న అంటుంది. ఇలాంటి టిఫిన్ చేసిన వారిని మన రెస్టారెంట్ కి తీసుకొని రావాలి లేక వాళ్లకు మన ప్రాంచైజీ ఇవ్వాలంటూ గొప్పగా పొగుడుతారు. అవునా అది దీప చేసింది అని సుమిత్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read