Karthika Deepam2 : దీప పోగుచేసిన డబ్బు కార్తీక్ కి ధైర్యమిచ్చిందా.. జ్యోత్స్న రివేంజ్ ఆమెపైనే!
on Dec 25, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -237 లో.... కాంచన దగ్గరికి శ్రీధర్ వెళ్తాడు. కార్తీక్ రెస్టారెంట్ పెట్టడానికి కావల్సిన డబ్బు ఇస్తాను.. నాకు సారీ చెప్పాలి.. ఇంకా నన్ను మీతో ఉండనివ్వాలని శ్రీధర్ షరతులు పెడతాడు. దాంతో కాంచనకి కోపం వచ్చి.. నీ డబ్బు అవసరం లేదు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోను.. నా దైర్యం నా కొడుకు తన వెంట నిజాయితీ గల భార్య దీప ఉంది అంటు తన డబ్బు తనకి ఇస్తుంది. దాంతో ఇంకా ఇక్కడెందుకు ఇంత అవమానం జరిగిన తర్వాత అని కావేరిని తీసుకొని శ్రీధర్ వెళ్ళిపోతాడు.
మరొకవైపు శివన్నారాయణ వాళ్లు భోజనం చేస్తుంటారు. ఎలా భోజనం చేయాలనిపిస్తుంది. మీ చెల్లి అక్కడ ఎక్కడో ఉంది అంటూ దశరత్ తో సుమిత్ర అనేసి తినకుండా సుమిత్ర వెళ్ళగానే దశరత్ వెళ్తాడు. శివన్నారాయణ కూడ తినకుండా వెళ్ళిపోతాడు కానీ పారిజాతం మాత్రం మంచిగా భోజనం చేస్తుంటుంది. నాకు బావ వెళ్లిపోవడం బాధగా ఉంది కానీ ఆ దీప గురించి వెళ్లినందుకు కోపంగా ఉందని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత దీప కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. డబ్బులు లేవు.. ఎవరిని అడగలేనని కార్తీక్ బాధపడుతుంటాడు. అప్పుడే దీప వెళ్లి తను కార్తీక్ కి ఇవ్వడం కోసం పోగు చేసిన డబ్బులున్న బాక్స్ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇవి సరిపోతాయా అని దీప అనగానే కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ డబ్బులు నాకు చాలా దైర్యాన్ని ఇచ్చాయి దీప అంటు థాంక్స్ చెప్తాడు.
మరొకవైపు దీప గురించి దాస్ బాధపడుతుంటాడు. ఆ తర్వాత శ్రీధర్ కి స్వప్న ఫోన్ చేసి నీకు బుద్ది ఉందా.. అన్నయ్య దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడావట అని కోప్పడుతుంది. దానికి శ్రీధర్ కూడా తనపై కోప్పడతాడు. కాసేపటికి స్వప్న దగ్గరికి దాస్ వచ్చి.. ఏమైందని అడుగుతాడు. కాంచన దగ్గరికి శ్రీధర్ వెళ్ళిన విషయం చెప్తుంది. బావేంటి ఇలా తయారు అయ్యాడని దాస్ అనుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ భోజనం చెయ్యడానికి అంతా సిద్ధం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read