Karthika Deepam2 : గౌతమ్ మోసగాడు అని చెప్పేసిన దీప.. అందరు నమ్ముతారా!
on Mar 27, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -315 లో.....దాస్ ని కాశీ బయటకు తీసుకోని వెళ్లి కూర్చోపెడతాడు. ఎవరు అతను అలా బెహేవ్ చేస్తున్నాడని గౌతమ్ పేరెంట్స్ శివన్నారాయణతో అంటారు. అతనికి గతం గుర్తు లేదు అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటాడని శివన్నారాయణ అంటాడు. అలాంటి వాడు ఫంక్షన్ లో ఎందుకు పంపించేయండి అని గౌతమ్ వాళ్ళ నాన్న అనగానే విన్నావ్ గా వెళ్లి పంపించమని పారిజాతం తో శివన్నారాయణ అంటాడు.
పారిజాతం బయటకు వెళ్లి ఇప్పుడు ఎలా ఉన్నావ్ రా కాశీ నువ్వు దాస్ ని ఇంటికి తీసుకొని వెళ్ళమని పారిజాతం చెప్తుంది. దాస్ చేతిలో అక్షింతలు వేసి మళ్ళీ ఆవి తన చేతిలో వేసుకోని నువ్వు వేసినట్లు జ్యోత్స్నకి అక్షింతలు వేస్తాను అని పారిజాతం అంటుంది. ఇవన్నీ అవసరమా అని కార్తీక్ అంటాడు. అందరు ఇక్కడే ఉంటే ఎలా లోపలికి పదండి అని పారిజాతం అంటుంది. కార్తీక్ బాబు మీరు ఇక్కడే ఉండండి.. నేను లోపల అందరికి కూల్ డ్రింక్స్ ఇస్తానని దీప, స్వప్న ఇద్దరు లోపలికి వెళ్తారు.
మరొక వైపు జ్యోత్స్న , గౌతమ్ ఇద్దరు రింగ్ లు మార్చుకోవడానికి రెడీ అవుతారు. అప్పుడే దీప గౌతమ్ ని చూసి షాక్ అవుతుంది. రింగ్ మార్చుకుంటుంటే ఆపండి అని దీప అంటుంది. వీడు మంచి వాడు కాదు.. ఒక అమ్మాయి జీవితం నాశనం చేసాడని దీప చెప్తుంది. ఎవరు మీరు అని గౌతమ్ అంటాడు. ఎవరి గురించి అలా మాట్లాడుతున్నావని శివన్నారాయణ అంటాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు ఏమైందని కార్తీక్ అడుగగా మొన్న ఒకతను ఒక అమ్మాయిని మోసం చేసాడని చెప్పాను కదా వాడు వీడే అని దీప అంటుంది. ఆ దీప గురించి గౌతమ్ తప్పు గా మాట్లాడుతుంటే గౌతమ్ చెంప చెల్లుమనిపిస్తుంది దీప. ఆవిడ నన్ను కొట్టిన మీరు అందరూ సైలెంట్ గా ఉన్నారంటే ఆవిడ చేప్పింది మీరు నమ్ముతున్నారా.. జ్యోత్స్న తన బావని ప్రేమించింది అయిన తనంటే ఇష్టంతో పెళ్లి చేసుకుంటున్నానని గౌతమ్ నటిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
