Home

»

Tv News

Karthika Deepam2 : పారిజాతానికి శివన్నారాయణ కఠిన శిక్ష.. దీపకు ఊహించని సర్ ప్రైజ్!

Jun 28, 2026 10:01AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్నా సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2  ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -708 లో...... దీప సీఈఓ కాకుండా పారిజాతం ట్రై చేసినందుకు తనకి పనిష్మెంట్ ఇస్తాడు. శివన్నారాయణ తను ఖచ్చితంగా ఇచ్చిన పనిష్మెంట్ సక్రమంగా చేస్తుందో లేదో కార్తీక్ ని చూడమని చెప్తాడు‌ పారు ముందు నువ్వు వెళ్లి గెటప్ చేంజ్ చెయ్ అని కార్తీక్ అంటాడు. పారిజాతం వెళ్లి పనిమనిషి గెటప్ లో వస్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. ఒకవేళ పారు ఎవరు లేనప్పుడు వెళ్లి గదిలో పడుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినదని గ్యారెంటీ ఏంటని కార్తీక్ అనగానే పారిజాతం గదికి శివన్నారాయణ తాళం వేస్తాడు. ఇప్పుడు ఓకేనా రా నువ్వు దీపని తీసుకొని ఇంటికి వెళ్ళమని కార్తీక్ తో శివన్నారాయణ అంటాడు. అందరు ఎక్కడివాళ్ళు అక్కడ వెళ్ళాక.. రేయ్ కార్తీక్ నన్ను గతంలోకి తీసుకొని వెళ్ళావ్.. నిన్ను అసలు వదిలి పెట్టనని పారిజాతం అనుకుంటుంది.

ఆ తర్వాత దీప సీఈఓ అయినందుకు కాంచన సంతోషంగా ఉంటుంది. వదినకి జ్యోత్స్న చేసిన పని గురించి చెప్పారా అని కాంచన అడుగుతుంది. లేదు.. తాత కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేసింది పారు.. ఇంట్లో చెప్పొద్దని కార్తీక్ చెప్తాడు. మరొకవైపు శివన్నారాయణ సుమిత్ర దశరథ్ మాట్లాడుకుంటారు. నా కూతురు ఏదైనా తప్పు చేసిందా మావయ్య అత్తయ్యకి మీరు పనిష్ మెంట్ ఇచ్చారు. దాన్ని బట్టే అర్థమవుతుంది. తను ఏదో తప్పు చేసిందని అందులో నా కూతురికి భాగం ఉందా అని సుమిత్ర అడుగుతుంది. నువ్వు ఆ విషయాలు గురించి ఆలోచించకు నీ కూతురిని నువ్వు అనుకునేలా మార్చే బాధ్యత నాది అని శివన్నారాయణ చెప్తాడు. అదంతా జ్యోత్స్న వింటుంది. తన గదిలోకి వచ్చేసరికి పారిజాతం కోపంతో ఊగిపోతుంది. జ్యోత్స్న మొదట భయపడుతుంది. తర్వాత లైట్ ఆన్ చేసే చూసేసరికి పారిజాతాన్ని చూసి నా గదిలో ఏం చేస్తున్నావని అడుగుతుంది.

దీనంతటికి కారణం ఆ సూరజ్ గాడు.. మీ తాతకి మళ్ళీమళ్ళీ గుర్తుచేసాడు. వాడిని వదిలిపెట్టొద్దు.. ఈ రోజుతో వాడి పీడ వదిలిపోవాలి.. మీ తాత వాడిని మెడ పట్టుకొని బయటకు గెంటేలా చేస్తానని పారిజాతం ఛాలెంజ్ చేసి వెళ్తుంది. అసలు గ్రానీ ఏం చేయబోతుందని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరొకవైపు దీపకి కాంచన చీరలు ఇంకా గోల్డ్ చైన్ ఇస్తుంది. అది చూసి దీప సర్ ప్రైజ్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com