
స్టార్ 'మా'లో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -702 లో..... సూరజ్ ఫుడ్ తీసుకొని డెలివరీ చెయ్యడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు ఫుడ్ మేం ఆర్డర్ చెయ్యలేదని చెప్తారు. అతను మోసం చేసాడని సూరజ్ కి అర్థమవుతుంది. ఆ తర్వాత దీపని శివన్నారాయణ తిడతాడు. నీ అజ్ఞానంతో ఒక పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేసావ్.. ఇప్పుడు మళ్ళీ లక్షల్లో నష్టం తెచ్చి పెట్టావని శివన్నారాయణ కోప్పడతాడు. అతని మాటలు చూస్తే అలా లేవు పెద్దయ్య.. ఇలా మోసం చేస్తాడు అనుకోలేదని దీప అంటుంది.
ఇక క్షమించనని శివన్నారాయణ అంటుంటే తను మట్టిమనిషి సర్ ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నష్టానికి బాధ్యత వహిస్తుందని కార్తీక్ అంటాడు. అప్పుడే మేనేజర్ వచ్చి అతను ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని అంటాడు. వాడు బ్యాంకు క్లోజ్ ఉన్న రోజు చెక్ ఇచ్చాడు అంటేనే అర్థం చేసుకోవాలి. ఇక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ దీప ఆఫీస్ లో అడుగుపెట్టడానికి వీల్లేదని శివన్నారాయణ అనగానే ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వమని దీప రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో శివన్నారాయణ సరే అంటాడు. సాయంత్రం వరకు మీకు ఛాన్స్ ఇస్తున్నాను.. ఈ ప్రాబ్లమ్ క్లియర్ చెయ్యకపోతే దీప ఇక ఆఫీస్ కి రానవసరం లేదని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత సూరజ్ డల్ గా కూర్చొని ఉంటాడు. ఏంట్రా పొగరుబోతోడా ఈ కాఫీ తీసుకోమని జ్యోత్స్న వస్తుంది. ఏంట్రా మాట పడిపోయిందా అని జ్యోత్స్న అనగానే ఇదంతా ఎవరో కావాలనే చేశారు.. నువ్వే చేసావని సూరజ్ అంటాడు. నువ్వు నాతో చేతులు కలుపు నీకు మంచి జాబ్ ఇస్తానని జ్యోత్స్న అంటుంది. ఐ లవ్ యు అని సూరజ్ చెప్తాడు దాంతో జ్యోత్స్న కోప్పడుతుంది.
మరొకవైపు దీప డల్ గా ఉంటుంది. అప్పుడే సూరజ్ వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఏం చెయ్యాలో నాకు పెద్దగా తెలియదు.. మీరు గతంలో టిఫిన్ సెంటర్ పెట్టినప్పుడు ఫుడ్ మిగిలితే ఏం చేశారని సూరజ్ అడుగుతాడు. మా నాన్న టిఫిన్ సెంటర్ పెట్టినప్పుడు లాటరీ పెట్టాము. అందులో గెలిచినవాళ్ళకి ఫుడ్ ఫ్రీ అని పెట్టేవాళ్ళం. ఆ తర్వాత మిగిలిన ఫుడ్ ని హాస్పిటల్ ముందుకు వెళ్ళి ఫుడ్ ఫ్రీగా పెట్టేదాన్ని అని దీప చెప్పగానే.. మంచి ఐడియా ఇచ్చారు రండి అని సూరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






