Home

»

Tv News

Karthika Deepam2 : శౌర్య మార్కులపై శివన్నారాయణ ఫైర్.. జ్యోత్స్నకు షాకిచ్చిన కార్తీక్!

Jul 5, 2026 10:11AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -714 లో..... దక్షిణామూర్తితో సూరజ్ మాట్లాడటం శివన్నారాయణ చూస్తాడు. సూరజ్ లోపలికి రాగానే అతనితో ఏం మాట్లాడుతున్నావని శివన్నారాయణ అడుగుతాడు. లోపలున్న వాళ్ళ గురించి చెప్పు అన్నాడు.. నాకేం తెలియదని చెప్పానని సూరజ్ అనగానే ఇంకొకసారి ఆ మనిషి ఎదురుపడితే మాట్లాడకని శివన్నారాయణ కోప్పడతాడు. అసలు ఎవరు అతను అని సూరజ్ అడుగుతుంటే కార్తీక్, దీప టెన్షన్ పడుతూ సూరజ్ ని అక్కడ నుంచి తీసుకొని వెళ్తారు.

ఆ తర్వాత శౌర్య స్కూల్ నుంచి ఆఫీస్ కి వస్తుంది. శివన్నారాయణ తనని చూసి.. నువ్వు ఏంటి ఇక్కడ అని అడుగుతాడు. దాంతో శౌర్య ప్రోగ్రెస్ కార్డ్ తీసి చూపిస్తుంది. ఏంటే అన్ని ఫెయిల్ అయ్యావని శివన్నారాయణ అడుగుతాడు. దీప కూతురు దీప లాగా కాకుండా ఎలా ఉంటుందని చెప్తూ జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. అయితే శౌర్యకి నువ్వే ట్యూషన్ చెప్పమని జ్యోత్స్నకి శివన్నారాయణ ఆర్డర్ వేస్తాడు. దాంతో కార్తీక్ నవ్వుకుంటాడు. అయితే పిన్ని ఇక నుంచి నాకు ట్యూషన్ చెప్తుందా అని శౌర్య అంటుంది‌. పిన్ని కాదు జో అను అని జ్యోత్స్న అంటుంది. మిస్ అను అని కార్తీక్ అంటాడు. అప్పుడే పారిజాతం వస్తుంది. జ్యోత్స్న ట్యూషన్ చెప్తుందని తెలిసి అలాంటి మంచి పని ఎందుకు చేస్తుందని పారిజాతం అనగానే సరే నువ్వే ట్యూషన్ చెప్పమని పారిజాతంతో జ్యోత్స్న అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సూరజ్ దగ్గరికి దీప, కార్తీక్ వస్తారు. సూరజ్ ఫ్యామిలీ గురించి కార్తీక్, దీప తెలుసుకోవాలని అనుకుంటారు‌ మీ ఊరు ఎక్కడ మీ వాళ్ళు ఎక్కడుంటారని కార్తీక్ అడుగుతాడు. నాకు ఏ బంధం లేదు.. ఇప్పుడు ఒక బంధం దొరికింది అన్నయ్య, వదిన.. అది మీరే అని సూరజ్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. అవసరం కోసం ఏ బంధం అయినా ఏర్పడుతుందని జ్యోత్స్న అనగానే అది అనురాగంతో వచ్చిన బంధం అని సూరజ్ అంటాడు. మరొకవైపు శౌర్యకి పారిజాతం పద్యాలు చెప్తుంది. తనకంటే శౌర్య బాగా చెప్తుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి నీ కంటే శౌర్య బెటర్ అంటాడు.

ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ కొన్ని ఫైల్స్ తీసుకొని వస్తాడు. అవి చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. అవన్నీ చూడడం నా వల్ల కాదని జ్యోత్స్న అంటుంది. ఇన్ని రోజులు ఏమైనా చూస్తే తెలిసేది.. ఇన్ని రోజులు టైమ్ పాస్ చేసి వెళ్లారు కదా.. ఇప్పుడు అలా కాదు కదా అని కార్తీక్ చెప్తాడు. దీప ఏం చెప్పిన చెయ్యాలి.. అది నీ బాధ్యత అని కార్తీక్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

Karthika Deepam 2 Serial Latest Episode, Karthika Deepam 2 Today Episode Telugu, Deepa Karthik Serial Star Maa, Karthika Deepam 2 Serial Highlights, Telugu Serial Updates TeluguOne.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com