శౌర్యని సైకిల్ పై తీసుకెళ్తున్న కార్తీక్.. పాపం సుమిత్ర!
on Jan 5, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -246 లో.....కార్తీక్, దీపలు కూరగాయలు తీసుకొని వెళ్తుంటే పారిజాతం వస్తుంది. కార్తీక్ ని ఆ సిచువేషన్ లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ నష్టజాతకురాలు దీప అని దీప గురించి పారిజాతం తప్పుగా మాట్లాడుతుంటే.. కార్తీక్ వినలేకపోతాడు. దీప నా అదృష్టదేవత తన వల్ల నాకూ ఈ సిచువేషన్ రాలేదు.. నా వల్ల తనకి వచ్చింది. అసలు దీనంతటికి కారణం నువ్వేనని పారిజాతం పై విరుచుకుపడుతాడు కార్తీక్.
నేనేం చేసానని పారిజాతం అడుగగా జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ముందు నీకే చెప్పాను కానీ నువ్వు పెళ్లి వరకు తీసుకొని వచ్చావంటూ కార్తీక్ అంటాడు. ఆ తర్వాత పారిజాతంతో కార్తీక్ గొడవ పెట్టుకొని దీపని తీసుకొని వెళ్ళిపోతాడు. వీడేంటి ఇంత రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. అయిన వాళ్లు విడిపోయే దాకా వదిలిపెట్టనని పారిజాతం అనుకుంటుంది.ఆ తర్వాత దాస్ ఏదో ఆలోచిస్తుంటాడు. కాశీ వెళ్లి కాఫీ ఇస్తాడు. దాస్ ఏదో ఆలోచిస్తూ మాట్లాడుతుంటే కాశీకి ఏం అర్థం కాదు ఎందుకు మావయ్య ఎప్పుడు అలా మాట్లాడుతాడని కాశీతో స్వప్న అంటుంది. మరొకవైపు శివన్నారాయణ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. రెస్టారెంట్ ప్రాఫిట్ తగ్గిందని అనగానే దానికి సంబందించిన నిర్ణయం సీఈఓగా నువ్వు తీసుకోవాలని శివన్నారాయణ అంటాడు. ఒక మాట మీకు చెప్దామని ఆగానని జ్యోత్స్న అనగానే.. అవసరం లేదు ఏ నిర్ణయమైనా నువ్వే తీసుకో అని శివన్నారాయణ అంటాడు. సరే అని జ్యోత్స్న వెళ్తుంది. అదేంటి నాన్న అన్నీ ఆలా తనకి వదిలేస్తే ఎలా అని దశరథ్ అనగానే.. అప్పుడే కదా తనకి బిజినెస్ గురించి తెలుస్తుంది కార్తీక్ ని మర్చిపోతుందని శివన్నారాయణ అంటాడు.
ఆ తర్వాత శౌర్యని కార్తీక్ స్కూల్ కి సైకిల్ పై తీసుకొని వెళ్తుంటే.. కాంచన, దీప ఇద్దరు చూసి బాధపడతారు. మరొకవైపు శివన్నారాయణతో గుడికి వెళ్తున్నానని సుమిత్ర చెప్తుంది. అప్పుడే పారిజాతం వచ్చి నేను వస్తానంటుంది. అవసరం లేదని శివన్నారాయణ అంటాడు. మరోకవైపు దాస్ ఇంటికి వస్తాడు. జ్యోత్స్న ఆపి ఎందుకిలా వస్తున్నావంటూ అడుగుతుంది. అప్పుడే సుమిత్ర వస్తుంది. ఎందుకు వద్దని అంటున్నావని జ్యోత్స్నని సుమిత్ర అడుగగా.. తాతయ్య ఉన్నాడు కదా గొడవ అవుతుందని జ్యోత్స్న అంటుంది. అలా అలోచించినందుకు సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. జ్యోత్స్న వెళ్ళిపోయాక జ్యోత్స్న ఏమైనా అందా అని దాస్ ని అడుగుతుంది సుమిత్ర. అదేం లేదని దాస్ అంటాడు. నాకు దీప, కార్తీక్, శౌర్యలని చూడాలని ఉంది తీసుకొని వెళ్తావా అని సుమిత్ర అనగానే.. పదండి అంటూ దాస్ తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read