Home

»

Tv News

Karthika Deepam 2: జ్యోత్స్న, సూరజ్ పెళ్లి.. మామూలు ట్విస్ట్ కాదిది.!

Nov 15, 2026 8:47AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -830 లో.. కార్తీక్ ఇంట్లో అందరు భోజనాలు చేస్తుంటారు. సుమిత్ర, దశరథ్ లు జ్యోత్స్నకి నెల రోజుల్లో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు చెప్తారు. దానికి జ్యోత్స్న జరగని వాటికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదంటుంది. కార్తీక్ మాత్రం జ్యోత్స్నకి సపోర్ట్ చేస్తాడు.

సూరజ్ జ్యోత్స్నకి కాల్ చేసి మాట్లాడాలంటాడు. జ్యోత్స్న నచ్చిన మనిషి మనతో ఉంటే సరిపోదు.. మనసులో ఉండాలని అంటుంది. ఐ లవ్ యూ అనేది ఇద్దరు మనసుల్ని కలిపే వారధి, దాన్ని నువ్వు కూల్చేశావ్, పగతో రగిలే నీకు ప్రేమ విలువ తెలీదని తెగేసి చెప్తుంది జ్యోత్స్న. తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్తే, సూరజ్ దానికి పరిష్కారం నా దగ్గర ఉందని, మన కుటుంబాల మధ్య రావణకాష్టం నేను ఆపుతానని రేపు అన్నింటికీ రెడీగా ఉండమని చెప్తాడు. ఈ మాటలు మాలిని వింటుంది.

ఆ తర్వాత మాలినికి పీడకల వస్తుంది. సూరజ్, జ్యోత్స్న పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినట్లు కలలో కనిపిస్తారు. అమ్మ దిష్టి తీయ్ అని సూరజ్ అంటే.. ఏంట్రా సుమిత్ర కూతుర్ని పెళ్లి చేసుకున్నావా అని మాలిని షాక్ అవుతుంది. జ్యోత్స్న మాత్రం నువ్వు దిష్టి తీసినా తీయకపోయినా మేం ఇంట్లోకి వస్తున్నామని అంటుంది. దక్షిణామూర్తి మాత్రం నా మనవరాలు వచ్చేసిందని సంబరపడతాడు. నేను ఒప్పుకోనని అరుస్తూ మాలిని లేస్తుంది.. తీరా చూస్తే అది కల. అది పీడకల అని చెప్తే తెల్లారి వచ్చే కల నిజం అవుతుందని దక్షిణామూర్తి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Karthika Deepam 2, Star Maa, Premi Viswanath, Nirupam Paritala]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com