ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam 2: కాంచనకి దీప మాటిస్తుందా.. జ్యోత్స్న ప్లాన్ ఏంటి?

on Feb 15, 2026

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీక దీపం-2 (Karthika Deepam 2)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-594 లో.. అనసూయ, దీప మాట్లాడుకుంటారు. కార్తీక్ బాబు నీ ఇద్దరి బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇద్దరు లేరు అత్తయ్య ఒక్కరే అని దీప మనసులో అనుకుంటుంది. అప్పుడే శౌర్య డ్రాయింగ్ తీసుకొని దీప దగ్గరికి వస్తుంది. నాకు చెల్లి కావాలని చెల్లి బొమ్మ వేయాలనుకున్నా కానీ పెద్దనానమ్మ తమ్ముడి బొమ్మ వేయమని చెప్తుందని శౌర్య అంటుంది. దీప మౌనంగా ఉంటుంది. 

 

కాసేపటికి కార్తీక్ వస్తాడు. నాన్నా కడుపులో ఉన్నది చెల్లా?తమ్ముడా? చెప్పు అని కార్యీక్ ని శౌర్య అడుగుతుంది కానీ అతను మౌనంగా ఉంటాడు. కడుపుతో ఉన్న వాళ్ళు పూజ చేయొచ్చా అత్తయ్య.. నేను రానని దీప అంటుంది. ఎందుకు రావని కాంచన అడుగుతుంది.  నాకు నీరసంగా ఉందని చెప్పి దీప గదిలోకి వెళ్తుంది. రేయ్ కార్తీక్ మీ ఇద్దరితో మాట్లాడాలని అంటుంది.

 

మరోవైపు జ్యోత్స్న తన గదిలో ఒంటరిగా నిల్చొని.. నాన్న ఎక్కడికి వెళ్ళాడని టెన్షన్ గా ఆలోచిస్తుంది. అప్పుడే పారిజాతం వచ్చి.. దాస్ ని కార్తీక్ , దీప కిడ్నాప్ చేశారు పదా వెళదామని జ్యోత్స్న తో పారిజాతం అంటుంది. నేను రానని అంటుంది. నాకు తెలుసే నువ్వు రావని.. ఎందుకంటే నువ్వు సుమిత్ర కూతురివి అని పారిజాతం అంటుంది. నేను కాదు అని జ్యోత్స్న అంటుంది. మరి నువ్వు కానప్పుడు రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి.. అయినా మొదటిసారి మ్యాచ్ కానీ రిపోర్ట్స్ రెండోసారి ఎలా మ్యాచ్ అవుతాయి.. నువ్వు ప్లాన్ చేయనప్పుడు, రిపోర్ట్స్ మార్చి చెప్పడానికి డాక్టర్ కి ఏం అవసరం అని పారిజాతం అనగానే జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. దీని వెనుకాల ఎవరో ఉన్నారని , అది ఎవరో తెలుసుకోవాలని జ్యోత్స్న అనుకుంటుంది. 

 

ఇక పారిజాతం నిలదీయడంతో సరే నువ్వు వెళ్లి నిజం చెప్పగానే బిడ్డల్ని మార్చింది నువ్వేనని చెప్తాను.. దాంతో శివన్నారాయణ నిన్ను గన్ తో షూట్ చేస్తాడని జ్యోత్స్న అంటుంది. దాంతో పారిజాతం భయపడుతుంది. మరి నా కొడుకు కూతురు ఎక్కడుందో ఏమో అని పారిజాతం బాధపడుతుంది. 

 

 

మరోవైపు దీప, కార్తీక్, కాంచన మాట్లాడుకుంటారు. నీ కడుపులోని బిడ్డకి ఏమీ కాదని నాకు మాటివ్వు దీప అని కాంచన అనగానే.. తన చేతిని కార్తీక్ చేతిలో పెట్టి నువ్వు నాకు మాటివ్వు అమ్మ అని కార్తీక్ అంటాడు. ఏంటని అడుగగా నువ్వు నాన్న కలిసి ఉంటామని మాట ఇస్తే దీప కడుపులోని బిడ్డ బాగుంటుందని దీప మాటిచ్చినట్టే అని కార్తీక్ అనగానే కాంచన తన చేతులని వెనక్కి తీసుకుంటుంది. ఇక దీప, కార్తీక్ దాని గురించే ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.