Karthika Deepam2 : దీపని చంపించాలని చూసిన జ్యోత్స్న.. కార్తీక్ ఏం చేయనున్నాడు!
on Jan 28, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-578 లో.. కాంచన, శ్రీధర్, కార్తీక్, దీప ఇంట్లో మాట్లాడుకుంటారు. నా ప్రతీ ఆలోచనకి సాక్ష్యం ఉంది. నా ప్రతీ అనుమానం వెనుక ఆధారం ఉంది. సాక్ష్యం కార్తీక్, ఆధారం దీప అని కాంచన అంటుంది. ఆధారం లేదు ఆధార్ కార్డ్ లేదని కాంచన మాటని కార్తీక్ కొట్టిపారేస్తాడు. నిజం చెప్పరా అని కాంచన అడుగగా.. నిజం.. నిజం అంటే చెప్పాలి.. జ్యోత్స్న, సుమిత్ర అత్త కూతురు కాదు.. అందుకే రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని కార్తీక్ అనగానే కాంచన, శ్రీధర్ తో పాటు దీప షాక్ అవుతుంది. అదేం లేదని, అవన్నీ నీ అపోహలు అని కార్తీక్ అనగానే కాంచన, శ్రీధర్ రిలాక్స్ అవుతారు.
మరోవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. ఆ రోజు గుడిలో మా అమ్మని చంపాలని రౌడీలని పంపింది నువ్వేనని నాకు తెలుసని పారిజాతంతో జ్యోత్స్న అనగానే తను షాక్ అవుతుంది. నేను చంపానని నిజం నీకెలా తెలుసని పారిజాతం అడుగగా.. నిజం ఎప్పుడు తెలుసు అనేది కాదు.. దానిని మనం ఎప్పుడు రివీల్ చేస్తామనేది ఇంపార్టెంట్ అని జ్యోత్స్న అంటుంది. నీలాగే నేను కూడా ఓ తప్పు చేశానని జ్యోత్స్న అనగానే ఏం తప్పు చేసావని పారిజాతం అడుగగా.. దాస్ ని గతం మర్చిపోయేలా కర్రతో తల పగులగొట్టింది గుర్తుచేసుకుంటుంది. ఏం తప్పు చేశావే అని పారిజాతం అడుగగా.. నిన్ను నమ్మడం నేను చేసిన తప్పు అని జ్యోత్స్న అంటుంది. మరోవైపు దీపకి కార్తీక్ ధానిమ్మ జ్యూస్ చేసి తాగమని ఇస్తాడు. నేను తాగనని దీప అనగానే..నువ్వు నీ గురించి పట్టించుకోవడం లేదు.. నీ కడుపులోని బిడ్డ గురించి పట్టించుకోవడం లేదని కార్తీక్ అంటాడు.
మా అమ్మని ఆ పరిస్థితులలో చూసి కూడా ఏం చేయలేకపోతున్నానని దీప ఎమోషనల్ అవుతుంది. నేనున్నాను కదా నేను చూసుకుంటాను అత్తకి ఏం కాదని కార్తీక్ అంటాడు. ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావ్ బావ అని దీప అంటుంది. అక్కడ మా అమ్మని జ్యోత్స్న చంపేలా చూస్తుంది. మరోసారి సాంపిల్స్ పంపించినా అవి మ్యాచ్ అవ్వవు.. దాని బదులు మా అమ్మని చంపేస్తే తను వారసురాలు కాదనే నిజం బయట పడదు కాబట్టి పారిజాతం అదే సలహా ఇస్తుందని కార్తీక్ తో దీప చెప్తుంది. అలాంటిదేం జరుగదని దీపకి సర్దిచెప్తాడు కార్తీక్. మరోవైపు దాస్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. మంచి భోజనం వడ్డిస్తుంది. నీ కూతురు ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉంటే హెల్ప్ చేయాలని లేదా నాన్న అని దాస్ తో జ్యోత్స్న అనగానే లేదని దాస్ చెప్తాడు. ఇక దాస్ ఓ కథని చెప్తాడు. ఆ తర్వాత నీ కథ అయిపోయింది జ్యోత్స్న.. నా అల్లుడు కార్తీక్ నీ కథని ముగిస్తాడని చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న గది నుండి బయటికి వచ్చి రౌడీలతో ఓ ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్, దీప పడుకొని ఉంటే రౌడీలు ఇంట్లోకి వచ్చి దీపని పొడవాలని చూస్తారు. అప్పుడే కార్తీక్, దీప లేస్తారు. వారిని చితక్కొడతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



