Karthika Deepam2 : శివన్నారాయణకి నిజం చెప్పేసిన కాంచన.. జ్యోత్స్న పెళ్ళి ఫిక్స్ చేస్తాడా?
on Apr 10, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -327 లో.... గౌతమ్ తనకి వార్నింగ్ ఇచ్చిన విషయం దీప గుర్తుచేసుకొని కోపంగా ఉంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏంటి కోపంగా ఉన్నావంటూ ప్రేమగా మాట్లాడి ఒక రోజ్ ఫ్లవర్ ఇస్తాడు. అప్పుడే కావేరి రావడం చుసిన దీప మీ పిన్ని వస్తుందని చెప్తుంది. కావేరి వచ్చి దీప తో మాట్లాడాలనగానే కార్తీక్ అక్కడ నుండి వెళ్లిపోతాడు. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ నువ్వు ఆపలేదు.. నీ చేత తనే ఆపించిందని కావేరి చెప్పగానే దీప షాక్ అవుతుంది.
పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకున్న ప్రతీమాట కావేరి చెప్పగానే దీపకి కోపం వస్తుంది. ఇదంతా కార్తీక్ ని నీ నుండి దూరం చేసి నీ ప్లేస్ లో జ్యోత్స్న ఉండాలనుకుంటుంది. నువ్వు ఏదో ఒకటి చెయ్ దీప అని కావేరి చెప్తుంది. సరే మీరు ఈ విషయం ఎవరికి చెప్పకండి అని దీప అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ జ్యోత్స్న పెళ్లిని ఫారెన్ లో చెయ్యాలనుకుంటాడు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న పారిజాతం,జ్యోత్స్నలకి ఆ విషయం చెప్తాడు శివన్నారాయణ. వద్దు నా పెళ్లి ఇక్కడే జరగాలి అయిన నాకు కొంత టైమ్ కావాలని జ్యోత్స్న చెప్తుంది.
మరొకవైపు దీప ఇంటికి వచ్చి కావేరి చెప్పింది మొత్తం కాంచనకి చెప్తుంది. జ్యోత్స్న ఏంటి ఇలా తయారైందని కోప్పడుతుంది. ఇప్పుడు ముహూర్తం పెట్టుకోకుండా ఆపాలని కాంచన అంటుంది. నేనే వెళ్లి జ్యోత్స్నకి బుద్ది చెప్తానని దీప వెళ్తుంటే.. కాంచన అనసూయ ఇద్దరు ఆపుతారు. నేనే వెళ్లి మాట్లాడుతా అని కాంచన అంటుంది. ఆ తర్వాత నేను పెళ్లి ముహూర్తం పెట్టడానికి వెళ్తున్నా.. ఈ విషయం జ్యోత్స్నకి ఇప్పుడే చెప్పకండి అని పారిజాతంతో శివన్నారాయణ అంటాడు. నాకు ఎదరు రామ్మా అని సుమిత్రతో శివన్నారాయణ అంటాడు. సుమిత్ర ఎదరు వస్తుంది. శివన్నారాయణ బయటకు వెళ్తుంటాడు. అప్పుడే కాంచన వస్తుంది. నాన్న గౌతమ్ మంచివాడు కాదని చెప్తుంది. కాంచన చెప్పేది నిజమని అనసూయ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



