Karthika Deepam 2: ఫుడ్ పాయిజన్ స్కెచ్ ఫెయిల్.. పెళ్ళికి ఒప్పుకున్న జ్యోత్స్న!
on Mar 15, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం- 2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-305 లో.. మేడమ్ మీరు రండి, జరిగేది చూడటానికి అంటూ జ్యోత్స్నకి వినోద్ చెప్పడంతో.. విజయ్ కంపెనీకి వస్తుంది జ్యోత్స్న. అక్కడ కార్తీక్, దీప, విజయ్ కంపెనీ ఉద్యోగులకు ఫుడ్ వడ్డిస్తూ ఉంటే జ్యోత్స్న చాటుగా చూస్తూ.. ఇక వీళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పడిపోతారు.. తర్వాత బావ, దీప అరెస్ట్ అయిపోతారు. సత్యరాజ్ రెస్టారెంట్ మూతపడిపోతుంది. బావ నావైపు వచ్చేస్తాడని ఊహించుకుంటుంది.
ఎంత సేపటికి ఎవరికి ఏమీ కాకపోయేసరికి, ఫుడ్ చాలా బాగుందని అందరు పొగిడేసరికి జ్యోత్స్న రగిలిపోతుంది. ఇక అక్కడే వడ్డిస్తున్న వినోద్‌ని కాల్ చేసి పక్కకు పిలుస్తుంది జ్యోత్స్న. వాడి కాలర్ పట్టుకుని.. అసలు మందు సరిగా కలిపావా లేదా అని జ్యోత్స్న అరుస్తూ ఉండగా.. అప్పుడే మన వంటలక్క ఎంట్రీ ఇస్తూనే.. సరిగానే కలిపాడని దీప అంటుంది. జ్యోత్స్న బిత్తరపోతుంది. నువ్వు ఎంత కలపమన్నావో అంతా కలిపాడని దీప అంటుంది. కానీ మధ్యలో చిన్న గ్యాప్ ఒకటి వచ్చింది. ఆ గ్యాప్‌లో ఏం జరిగిందంటే అని దీపక్క జరిగింది మొత్తం చెప్తుంది. వినోద్ చెంప పగలగొట్టిన సీన్ చూపిస్తారు స్క్రీన్ మీద. ఇక వినోద్ వైపు జ్యోత్స్న కోపంగా చూడగానే.. వినోద్ చెంప పట్టుకుని నిలబడతాడు. నీ డబ్బుకి అమ్ముడు పోయిన వినోద్ నా దెబ్బకు మారిపోయాడని దీపక్క అంటుంది. వినోద్ నువ్వు వెళ్లని అంటుంది.
నిజానికి కొట్టాల్సింది వాడ్ని కాదు.. నిన్ను.. తినే భోజనంలో మందు కలిపిస్తావా అంటూ జ్యోత్స్నని దీప లాగిపెట్టి కొట్టేస్తుంది. ఇంతలో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. నా పేరు చెప్పి ఇంకొకటి పీకు అని కార్తీక్ అంటాడు. బావా అని జ్యోత్స్న అరుస్తుంది. నోర్ముయ్.. శౌర్య విషయంలో ఆధారం లేదని నిన్ను వదిలిపెట్టలేదు.. దానికి వేరే కారణం ఉందని దీప అరుస్తుంది. నీ చుట్టు మంచి వాళ్లు ఉండటం వల్ల ఇలా తప్పించుకుంటున్నావ్ కానీ, తాగి కారు యాక్సిడెంట్ చేసిన రోజే జైలుకి వెళ్లాల్సిన మనిషివి అని కార్తీక్ అంటాడు. ఏం బతుకు జ్యోత్స్నా ఇది.. ఏ కుటుంబంలో పుట్టావ్.. ఏం పనులు చేస్తున్నావని దీప అంటుంది.
ఇక జ్యోత్స్నకి మాట్లాడే ఛాన్స్ దీప, కార్తీక్ లు ఇవ్వరు. మారవా నువ్వు.. ఏంటి ఈ పనులు.. అసలు నువ్వు ఎవరికి కూతురివి.. ఇదేనా పద్దతి.. బుద్ధిగా పెళ్లి చేసుకుని మంచి జీవితానికి ఆహ్వానం పలుకు. మా జోలికి రావద్దు.. మరోసారి ఇలా జరిగితే ఈ పంచాయితీ మీ ఇంట్లో మీ తాత ముందు జరుగుతుంది.. పడాల్సినవి పడ్డాయిగా పో బుద్ధిగా ఇంటికి పోమంటూ కార్తీక్ కూడా జ్యోత్సకి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. వెంటనే దీపను తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్. ఇక జ్యోత్స్న తెగ రగిలిపోతుంది. ఛ వేస్ట్ గాడ్ని నమ్మకుని పరువు మొత్తం పోగొట్టుకున్నానని జ్యోత్స్న అనుకుంటుంది.
ఇక దీప, కార్తీక్ ఇంటికి వచ్చి.. జ్యోత్స్న చేసిన కుట్ర, తప్పిన ప్రమాదం గురించి చెప్పడంతో.. మా నాన్నను అడిగేస్తా కడిగేస్తా.. మా పుట్టింటికి వెళ్దాం పదా.. మా వదినను కూడా నిలదీయ్యాలి. కూతుర్ని ఇలా నా కొడుకు మీద వదిలేసి ఏం చేస్తున్నారో అడుగుతాను.. అర్జెంట్‌గా దానికి పెళ్లి చేసి పంపించమని చెప్పాలని కాంచన రెచ్చిపోతూ ఉంటుంది. కార్తీక్, దీపలు సర్దిచెబుతూ ఉంటారు.
ఇంతలో కాంచనకు సుమిత్రతో కాల్ చేయిస్తాడు దశరథ్. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది.. త్వరలో ముహూర్తాలు పెట్టబోతున్నామని చెప్పు సుమిత్ర అని కాల్ చేయిస్తాడు. సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేసిన కాంచన.. చెప్పు వదిన అనకుండా.. నేను కాంచననే మాట్లాడుతున్నా.. ఏంటి ఫోన్ చేసిన వాళ్లు మాట్లాడటం లేదని కోపంగా అంటుంది. దాంతో సుమిత్ర బాధగా.. నీ కోడలు దీపను కొట్టినందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావని అర్థమైంది వదినా అని మనసులో అల్లాడిపోతూ... అదేంటి వదినా బంధం అనేది ఒకటి ఉంటుంది కదా అంటుంది. అలవాటుగానే బాధపెడుతున్నారుగా.. ఇందులో ఏముంది? ఎందుకు ఫోన్ చేశారో చెబితే బాగుంటుందని కాంచన అంటుంది. నిజానికి కాంచన కోపం.. జ్యోత్స్న చేసిన ఫుడ్ పాయిజన్ స్కెచ్ గురించి కానీ సుమిత్ర అనుకునేది దీప నేను కొట్టానన్న నిజం చెప్పేసినట్లుందని బాధపడుతుంది. వదినా జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది. త్వరలో పెళ్లి అని సుమిత్ర చెప్తుంది. కాంచన వెంటనే సంతోషం ఉంటానని కాంచన ఫోన్ పెట్టేస్తుంది.
అయితే కాంచన స్పీకర్‌లో పెట్టి మాట్లాడటంతో కార్తీక్, దీప, అనసూయ అంతా వింటారు. కాంచన కూడా సంతోషిస్తుంది. వెంటనే దీప లోపలికి వెళ్లి స్వీట్స్ పట్టుకుని వచ్చి.. మనకు రెండు శుభవార్తలు. జ్యోత్స్నకు పెళ్లి కుదిరింది. అంటే మన జోలికి ఇక రాదు. రెండోది ఈ రోజు విజయ్ కంపెనీకి ఫుడ్ పట్టుకుని వెళ్లడంతో మన పేరు ఇంకా పెరిగిందని స్వీట్స్ అందిస్తుంది. అయితే కార్తీక్ మాత్రం జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడం ఏంటా అన్నట్లు షాక్‌లో ఉంటూనే దీప ఇచ్చిన స్వీట్ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
