Karthika Deepam2 : దాస్ మామయ్య కోసం పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్న కార్తీక్!
on Jan 21, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -572 లో.... పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకుంటారు. నువ్వు ఏ ధైర్యంతో సాంపిల్స్ ఇచ్చావే.. ఇప్పుడు గానీ ఆ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదంటే అందరికి డౌట్ వస్తుంది. నువ్వు కూతురు కాదని తెలుస్తుందని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇక మనం అనుకున్నది ఏది జరగదని పారిజాతం అంటుంటే.. తధాస్తూ అంటూ కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఏంట్రా అని పారిజాతం అంటుంది. మీరు ఏదో జరగదని అంటున్నారు కదా అందుకే అంటున్నానని కార్తీక్ అంటాడు.
నిన్నటి నుండి దాస్ మావయ్య కన్పించడం లేదు ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని కార్తీక్ అనగానే వాడు ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదని పారిజాతం అంటుంది. అప్పుడే దాస్ మెడలో నుండి పడిపోయిన తయాత్తు కార్తీక్ చూపిస్తాడు. ఇది గార్డెన్ లో దొరికిందని కార్తీక్ అనగానే జ్యోత్స్న భయపడుతుంది. అవును రా ఇది దాస్ ది అని పారిజాతం అంటుంది. దాస్ మావయ్య కన్పించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కార్తీక్ అంటాడు. ఎందుకురా ప్రతిసారీ పోలీస్ కంప్లైంట్ అంటావని పారిజాతం అంటుంది. ఆవును వస్తాడులే అని జ్యోత్స్న అంటుంది. ఒక్క రోజు చూస్తాను రాకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కార్తీక్ అంటాడు. నాకు భయంగానే ఉంది.. వీడు ఎక్కడికి వెళ్ళాడోనని పారిజాతం అంటుంది. వస్తాడు గ్రానీ అని జ్యోత్స్న అనగానే నాకెందుకు జ్యోత్స్న పై డౌట్ వస్తుందని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ మాట్లాడుకుంటుంటే అప్పుడే సుమిత్ర వస్తుంది. తనలో ఉన్న బాధని వాళ్ళకి చెప్తుంది.
నా కూతురికి పెళ్లి అయ్యే వరకు అయిన బాగుంటే నాకు అదే చాలు.. నేను ప్రేమించినంతగా నా కూతురు నన్ను ప్రేమించదు.. అలా ప్రేమించాలని కూడా అనుకోనని సుమిత్ర బాధపడుతుంది. ఆ తర్వాత సుమిత్ర డల్ గా ఉందని కార్తీక్ తన చిన్నప్పటి ఫోటోని సుమిత్రకి పంపిస్తాడు. అది చూసి నవ్వుతుంది. ఆ ఫోటోను చూసి ఇంట్లో అందరు నవ్వుతారు. ఇందులో నవ్వడానికి ఏముంది పాప కదా అని దీప అంటుంది. అది మీ అయన చిన్నప్పటి ఫోటో.. దాని వెనకాల ఒక కథ ఉంది సుమిత్ర అనగానే అందరు నవ్వుకుంటారు. అదేంటో చెప్పండి అని దీప అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



