Karthika Deepam2 : దీప సాంపిల్స్ మ్యాచ్ అవుతాయా.. ఇంటికెళ్ళిన కాశీ!
on Jan 30, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -580 లో.....జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. నా కొడుకు కన్పించడం లేదు.. నాకేదో భయంగా ఉందని పారిజాతం అంటుంది. అప్పుడే రౌడీ ఫోన్ నుండి దాస్ ఫోన్ చేస్తాడు.. ఎవరని పారిజాతం అడుగుతుంది నా ఫ్రెండ్ అని జ్యోత్స్న చెప్పగానే పారిజాతం వెళ్ళిపోతుంది. జ్యోత్స్న ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. మీ చెంచా గాళ్ళు అనుకుటుంటే విన్నాను.. నీ ప్లాన్ ఫెయిల్ అయిందట కదా.. నీ పతనం ఆరంభం అయింది జ్యోత్స్న అని దాస్ హెచ్చరిస్తాడు. దాంతో జ్యోత్స్నకి భయమేస్తుంది.
మరొకవైపు దీప, కార్తీక్ హాస్పిటల్ కకి వెళ్తారు. డాక్టర్ నాకు టెస్ట్ చేసి సాంపిల్స్ తీసుకోండి మ్యాచ్ అవుతాయని దీప చెప్పగానే మీవేలా మ్యాచ్ అవుతాయి. మీకు ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని సుమిత్ర చెప్పిందని డాక్టర్ అంటుంది. మ్యాచ్ అవుతాయి ఒకసారి ట్రై చెయ్యండి అని కార్తీక్ అంటాడు. నాకేం అర్థం కావడం లేదు.. ఎలా మ్యాచ్ అవుతాయి.. ఇలా ప్రతీవారిని టెస్ట్ చేసుకుంటూ పోతే టైమ్ వెస్ట్ అవుతుందని డాక్టర్ అంటుంది. అయినా వినకుండా కార్తీక్, దీప రిక్వెస్ట్ చేస్తారు. దాంతో డాక్టర్ సరే అంటుంది. మరొకవైపు కాంచన గుడికి వెళ్తుంది. అక్కడ కాశీ కన్పిస్తాడు. కాశీ అవతారం చూసి కాంచన బాధపడుతుంది.
ఏంట్రా ఇలా అయ్యావని కాంచన అడుగుతుంది. నాకు జీవితమే పోయింది అత్త అని కాశీ ఏడుస్తాడు. కాశీ ఎమోషనల్ అవుతుంటే కాంచన ఏడుస్తుంది. నేను తప్పు చేశాను అత్త అని కాశీ అంటాడు. నువ్వు ముందు ఇంటికి పదా అని కాంచన అంటుంది. నన్ను స్వప్నని నువ్వే కలుపు అత్త అని కాశీ అంటాడు. సరే అని కాంచన తన వెంట కాశీని తీసుకొని వెళ్తుంది. మరొకవైపు పారిజాతం, కార్తీక్ మాట్లాడుకుంటారు. మొన్న దాస్ మావయ్య ఇంటికి వచ్చినప్పుడు నీతో పాటు నేను కూడా చూసాను.. నాకు ఎందుకో జ్యోత్స్న పై డౌట్ ఉంది. నువ్వు ముందు జ్యోత్స్న దగ్గరికి వెళ్లి నేను చెప్పినట్లు చెప్పు తన మొహంలో క్లియర్ గా తెలుస్తుందని పారిజాతంతో కార్తీక్ అంటాడు. దానికి పారిజాతం సరే అని జ్యోత్స్న దగ్గరికి వెళ్లి.. జ్యోత్స్న పోలీస్ స్టేషన్ కి వస్తావా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



