
బిగ్ బాస్ ఇంట్లోంచి బయటకు వచ్చిన వారిలో చాలా మందికి సినిమా అవకాశాలు వస్తాయి . బిగ్ బాస్ షోలో వచ్చిన క్రేజ్‌ని పెట్టుకుని హీరోలుగా వెండితెరపై రాణించాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్‌లు హీరోలుగా ప్రయత్నించారు. అందులో కొందరు సక్సెస్ అవ్వగా మరికొందరు ఫెయిల్ అయ్యారు. కళ్యాణ్ పడాల మాత్రం యాక్టింగ్‌లో ఎలాంటి అనుభవం లేకపోయినా, నటన అంటే ఇష్టం ఉండటంతో.. సినిమాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే ఆర్మీలో జాబ్ వదిలేసుకుని బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చాడు. అక్కడి నుంచి బిగ్ బాస్ విన్నర్‌గా తన ప్రయాణాన్ని సక్సెస్ చేసుకున్నాడు.
బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత కళ్యాణ్ పడాల అడపాదడపా బుల్లితెరపై కనిపించాడు. కొన్ని ఈవెంట్లు చేశాడు. కుకు విత్ జాతిరత్నాలులో మూడు, నాలుగు ఎపిసోడ్స్‌లో కనిపించాడు. అయితే కళ్యాణ్ పడాల ఓ నటుడిగా ఇంత వరకు ఆడియన్స్‌కి తెలీదు. రీసెంట్‌గానే కళ్యాణ్ పడాల మొదటి మూవీ ఓపెనింగ్ జరిగింది. ఫన్ అనే డిఫరెంట్ టైటిల్‌తో సినిమాని ప్రారంభించారు. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి హేమంత్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. కళ్యాణ్ పడాల రెండో మూవీ అప్డేట్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ వేశాడు. సినిమాలో కొత్త చాప్టర్ ప్రారంభం కానుంది.. విజన్‌తోనే ప్రతీ జర్నీ స్టార్ట్ అవుతుంది.. కానీ అందరికీ చెప్పాల్సిన కథతో మా జర్నీ స్టార్ట్ అవుతోంది.. ఎలెవన్ క్రియేటివ్ వర్క్స్ ఈ చిత్రంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది.. కళ్యాణ్ పడాలకి రెండో సినిమా కాగా.. ఈ ప్రొడక్షన్‌కి మొదటి సినిమా అని ప్రకటించారు. డ్రీమ్ అసోసియేషన్.. కొత్త విజన్.. కొత్త సినిమాటిక్ జర్నీ.. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని కళ్యాణ్ పడాల పోస్ట్ వేశాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
బిగ్ బాస్ సీజన్-9 లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి చివరికి విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల లైఫ్ స్టోరీ అందరికి తెలిసిందే. అయితే అతని సినిమా ప్రయాణం ఎలా సాగుతోందో చూడాలి మరి.




.webp)
.webp)
