.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-415 ఆసక్తిగా సాగింది. జయ బ్యాగ్ లోకి డబ్బు ఎలా వచ్చిందని వంశీని రుద్ర అడుగుతాడు. వంశీ సైలెంట్ గా ఉండడంతో చెంప చెళ్లుమనిపిస్తాడు. జయకి గిఫ్ట్ ఇవ్వడానికి తనే 10 లక్షలు దొంగతనం చేసి జయకి ఇచ్చానని వంశీ చెప్పగానే అందరు షాక్ అవుతారు. దొంగతనం చేశావా అని వంశీపై రాఘవ కోప్పడతాడు. జయపై విశ్వ కోప్పడతాడు. గంగ సారీ అమ్మ అని విశ్వ చెప్తాడు. మీరు ఎందుకు సారీ చెప్తారు. జయ వాళ్ల పేరెంట్స్ కి సారీ చెప్పాలని సుధా అనగానే లక్ష్మి, పైడిరాజుకి జయ సారీ చెప్తుంది.
నా కూతురు తప్పు చేసింది నాకు ఇక్కడ ఉండాలని లేదని విశ్వ అనగానే అలా అనకండి మావయ్య, నిజం ఏంటో తెలియాలని చెప్పానంతే, ఈ ఇంటి ఆడపిల్ల మీద నిందలు ఎవరూ వేయరని చెప్పడానికే ఇదంతా అని రుద్ర చెప్తాడు. వాళ్లది ఏం తెలియని వయసు, మనమే అన్నీ చెప్పాలి, జరిగింది మర్చిపోండి అని విశ్వతో పెద్దసారు అంటాడు. ఆ తర్వాత బారసాల ఫంక్షన్ జరుగుతుంది.
మరోవైపు బాలకృష్ణ రావడం పైనుండి ఇషిక చూసి వీరుకి చెప్తుంది. వాళ్లు శకుంతల దగ్గరికి వెళ్ళి.. బాలకృష్ణ వస్తున్నాడని చెప్తారు. శకుంతల అతనికి ఎదురుగా వెళ్లి ఎవరు కావాలని అంటుంది. దాంతో బాలకృష్ణ తను చెప్పాలనుకున్న నిజాన్ని పేపర్ పై రాసి ఇస్తాడు. అందులో గంగ విశ్వ కూతురు అన్న విషయం చూసి శకుంతల అతన్ని డైవర్ట్ చేసి నేను రుద్రకి చెప్తాను. మీరు వెళ్లిపోండి అని పంపిస్తుంది. వీరు వచ్చి ఆ పేపర్ పూర్తిగా చదువుతాడు. చివర్లో రామనాథంని చంపింది వీరూనే అని ఉండడంతో వెంటనే శకుంతల చూడకుండా వీరు చింపేసి గంగ గురించే ఉందని చెప్పి అక్కడ పారేస్తాడు.
మరోవైపు కార్తీక్, ప్రమీల మాట్లాడుకోవడం గంగ, రుద్ర చూసి వాళ్ల పెళ్లి గురించి పెద్దసారుతో మాట్లాడాలని అనుకుంటారు. కానీ శకుంతల పెద్దసారుని పక్కకి తీసుకెళ్లి కార్తీక్ ప్రమీలతో క్లోజ్ గా ఉండడం నాకు నచ్చడం లేదని అంటుంది. అలా ఎందుకు అనుకుంటావ్, వాళ్లకి పెళ్లి చేస్తే బాగుంటుందని పెద్దసారు అనగానే అలా ఏం వద్దు, ప్రమీల ఎప్పుడూ నా కోడలుగానే ఉండాలని శకుంతల కచ్చితంగా చెప్తుంది. ఆ మాటలు గంగ, రుద్ర విని డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత ప్రీతి వాళ్ళ బాబుకి భానుకిరణ్ అని పేరుని రుద్ర చెవిలో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






