Jayam serial : వీరు పగ అదే.. సూపర్ మార్కెట్ రీఓపెన్ చేసిన గంగ, రుద్ర!
on Jan 28, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -178 లో..... వీరు, ఇషిక ఇద్దరు గంగ గురించి మాట్లాడుకుంటారు. గంగని చంపడానికి రౌడీలని మాట్లాడింది నేనే అని ఇషికతో వీరు మాట్లాడతాడు. నాకు ఒక డౌట్ అసలు ఈ కుటుంబం అంటే ఎందుకు ఇంత పగ నీకు.. నాపై నమ్మకం ఉంటేనే చెప్పు బ్రో అని ఇషిక అంటుంది. నీపై నమ్మకం ఉంది కాబట్టే అన్నీ నీతో చెప్పి నీ హెల్ప్ తీసుకుంటున్నానని వీరు అంటాడు.
మా నాన్న ఇంకా విజయేంద్ర ప్రతాప్ ప్రాణస్నేహితులు ఇద్దరు కలిసి బిజినెస్ చేశారంటూ వాళ్ళ నాన్నకి జరిగిన అన్యాయం గురించి వీరు చెప్తాడు. మా నాన్న చనిపోయాడు. మా అమ్మకి విజయేంద్ర ప్రతాప్ కుటుంబం నాశనం చేస్తానని మాటిచ్చానని వీరు చెప్తాడు. పగకి మనిషి రూపం ఉంటే నీలాగే ఉంటుందేమోనని ఇషిక అంటుంది. ఆ తర్వాత సూపర్ మార్కెట్ రీ ఓపెనింగ్ కి అన్ని సిద్ధం అయ్యాయో లేదో అని స్టాఫ్ కి ఇంకా మేనేజర్ మాక్కంకి గంగ ఫోన్ చేసి కనుక్కుంటుంది. మరుసటి రోజు ఉదయం సూపర్ మార్కెట్ లో పూజ చేస్తారు. స్టాక్ అంతా వస్తుంది.
ఇందుమతి తనకి నచ్చిన వస్తువులు తీసుకుంటుంటే.. అది నీకు కాదే అమ్మడానికి అని తన భర్త అంటాడు. ఇక గంగ దగ్గరికి వంశీ వెళ్లి.. వదిన నా గర్ల్ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలని అడుగుతాడు. ఆ తర్వాత గంగ ఎప్పుడు తింటూనే ఉంటుంది. పని చేతకాదు ఏం కాదు అని గంగ గురించి సూర్యతో రుద్ర చెప్పడం గంగ వింటుంది. దాంతో కోపంగా గంగ వెళ్తుంది. అన్నయ్య వదిన వెళ్తే ఈ స్టాక్ అంతా ఎవరు సెట్ చేస్తారు. వెళ్లి రిక్వెస్ట్ చెయ్యమని సూర్య, వంశీ అనగానే గంగ దగ్గరికి రుద్ర వెళ్లి రిక్వెస్ట్ చెస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



